E-Paper
Advertisement

ఆహారంలో ఉప్పు ఎక్కువైతే అంతే సంగతులు.. ఈ 5 ప్రాణాంతక వ్యాధులు గ్యారెంటీ !

ఆహారంలో ఉప్పు ఎక్కువైతే అంతే సంగతులు.. ఈ 5 ప్రాణాంతక వ్యాధులు గ్యారెంటీ !
Advertisement

Salt Side Effects: ఆహారంలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. కానీ అదే ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. సోడియం క్లోరైడ్ శరీరంలో.. ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైనప్పటికీ.. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనం తెలియకుండానే.. ప్రమాదకర స్థాయిలో ఉప్పును తీసుకుంటున్నాం. అధిక ఉప్పు కేవలం రక్తపోటుకే పరిమితం కాకుండా.. కిడ్నీలు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉప్పు వల్ల కలిగే.. ఈ నిశ్శబ్ద ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం  అత్యవసరం.

అధిక ఉప్పు వినియోగం వల్ల కలిగే ప్రధాన అనర్థాలు:
మనం రోజు వారీ తీసుకునే ఉప్పు పరిమాణం 5 గ్రాముల (ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉండాలని డాక్టర్లు సూచిస్తారు. అంతకంటే.. ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలు ఇవే

Advertisement

1. అధిక రక్తపోటు :
ఉప్పులో ఉండే సోడియం రక్తంలో చేరినప్పుడు.. అది తనతో పాటు నీటిని కూడా లాక్కుంటుంది. దీని వల్ల రక్త నాళాల్లో రక్తం పరిమాణం పెరిగి, ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలక్రమేణా ‘హైపర్ టెన్షన్’కు దారి తీస్తుంది.

2. గుండె జబ్బులు, స్ట్రోక్ :
నిరంతరాయంగా అధిక రక్తపోటు ఉండటం వల్ల గుండె పై భారం పెరుగుతుంది. ఇది గుండె పోటు, మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయే స్ట్రోక్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.

Advertisement

3. కిడ్నీ సమస్యలు :
శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపే.. బాధ్యత కిడ్నీలది. ఉప్పు ఎక్కువైనప్పుడు కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఇది కాల క్రమేణా కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

4. ఎముకల బలహీనత :
ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు, శరీరం యూరిన్ ద్వారా సోడియంను బయటకు పంపే క్రమంలో.. క్యాల్షియంను కూడా కోల్పోతుంది. దీని వల్ల ఎముకలు సాంద్రత కోల్పోయి బలహీన పడతాయి. ముఖ్యంగా.. మహిళల్లో ఇది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

5. పొట్ట క్యాన్సర్ :
అధిక ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు పొట్టలోని లోపలి పొరను దెబ్బతీస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ ఉప్పు తీసుకునే.. వారిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

Also Read: అరుదుగా దొరికే పచ్చి బాదం.. దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే వదలరు!

6. నీరు నిలిచిపోవడం:
శరీరంలో సోడియం పెరిగితే.. కణాలు నీటిని నిల్వ చేసుకుంటాయి. దీని వల్ల కాళ్లు, చేతులు వాపు రావడం, కడుపు ఉబ్బరంగా.. అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఉప్పు వాడకాన్ని ఎలా తగ్గించాలి ?
ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు: చిప్స్, ప్యాక్డ్ స్నాక్స్, సాస్‌లు, ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం విపరీతంగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండండి.

లేబుల్స్ చదవండి: సూపర్ మార్కెట్‌లో వస్తువులు కొనేటప్పుడు ‘Low Sodium’ అని ఉన్న వాటిని ఎంచుకోండి.

సహజ రుచులు: కూరల్లో ఉప్పుకు బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాల పొడి లేదా ఇతర మూలికలను వాడి రుచిని పెంచండి.

టేబుల్ సాల్ట్ వాడకండి: అన్నం తింటున్నప్పుడు పక్కన ఉప్పు వేసుకోవడం లేదా పైన చల్లుకోవడం మానేయండి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×