E-Paper
Advertisement

Copper Ring: రాగి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Copper Ring: రాగి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Copper Ring: మీరు చేతికి రాగి ఉంగరం ధరిస్తున్నారా..? లేదా రాగి బ్రాస్‌లెట్‌ లేదా ఇంకేదైనా రాగితో చేసింది ధరిస్తున్నారా..? అయితే రాగి ఉంగరం కానీ బ్రాస్‌లెట్‌ కానీ ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..? అసలు రాగి మనిషి శరీరాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా..? రాగిలో దాగి ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాగి ఉంగరం (Copper Ring) ధరించడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న ఒక ఆచారం. దీని వెనుక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నమ్ముతారు. రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్య పరమైన లాభాలు: రాగి ధరించడం వల్ల ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపశనమం లభిస్తుందట.  రాగి ఉంగరం ధరించడం వల్ల ఆ నొప్పుల నుంచి ప్రశాంతత లభిస్తుందని చాలా మంది నమ్ముతారట. ఇది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుందట. రక్త ప్రసరణలోనూ రాగి చాలా బాగా ఉపయోగపడుతుందట. రాగి రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా.. ఇది రక్తపోటును (Blood Pressure) నియంత్రించడంలోనూ.. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ.. ఎంతగానో  తోడ్పడుతుందట. ఇక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి రాగి సహాయపడుతుందట. చర్మం ద్వారా రాగి సూక్ష్మ పరిమాణంలో శరీరంలోకి చేరడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు: జ్యోతిష్య, ఆధ్యాత్మికంగా కూడా రాగికి చాలా ప్రాధాన్యత ఉందట. సూర్య గ్రహ దోషాలు నివారించడంలో రాగి చాలా బాగా ఉపయోగపడుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి సూర్యుని లోహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా సూర్య దోషాలు ఉన్నప్పుడు రాగి ఉంగరం ధరించమని పండితులు సూచిస్తుంటారు. ఇంకా రాగి ఉంగరం ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, కోపం తగ్గుతుందని నమ్ముతారట. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ప్రతికూల శక్తి నివారించడంలో రాగి చాలా బాగా పని  చేస్తుందట.  చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి రాగి సహాయపడుతుందట.

రాగి ఉంగరంతో ఇతర ఉపయోగాలు: రాగిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయట, ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయట. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కూడా ఇది సహాయపడుతుందట. రాగి ఉంగరాన్ని సాధారణంగా కుడి చేతి ఉంగరపు వేలుకి (Ring Finger) ధరించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. రాగి గాలితో మరియు చమటతో చర్య జరిపి పచ్చగా మారవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలట. అలాగే కొంతమందికి రాగి వల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు. అలా అనిపిస్తే వెంటనే ధరించడం ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ తేదీలో పుట్టిన వారు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారట – ఏ తేదీనో తెలుసా..?

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×