BigTV English

Sleep Drinks: ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పట్టాలంటే రాత్రి ఈ డ్రింకులు తాగేయండి

Sleep Drinks: ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పట్టాలంటే రాత్రి ఈ డ్రింకులు తాగేయండి

Sleep Drinks: ఉదయం ఎంత కష్టపడినా రాత్రి చక్కగా నిద్ర పడితేనే అలసట తగ్గేది. ఇప్పుడు ఒడిదుడుకల జీవనశైలిలో అంతర్లీన ఆరోగ్య సమస్యల కారణంగా హాయిగా నిద్రపోతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఒత్తిడి కారణంగా నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతూ సగం రాత్రి వరకు లేచి ఉంటున్నారు. మీరు హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.


కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుని హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. నిద్ర మాత్రలకు అలవాటు పడితే ఆ టాబ్లెట్ లేనిదే ఇక మీకు నిద్ర పట్టదు. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం సహజ పద్ధతుల్లోనే మీకు నిద్ర వచ్చేలా చేసుకోవాలి. అందుకోసం కొన్ని రకాల పానీయాలు ఉన్నాయి. వీటిని రాత్రి నిద్ర పోయేముందు తాగండి. వీటిని తాగాక ఒక అరగంట గంటలో మీకు మంచి నిద్ర పడుతుంది.

అశ్వగంధ పాలు
అశ్వగంధ ఎన్నో ఆరోగ్య విలువలు కలిగిన ఔషధం. ఇది ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఒక కప్పు గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడిని అర స్పూను కలుపుకొని తాగితే మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అంతేకాదు ఒత్తిడిని తట్టుకునే శరీర సామర్థ్యాన్ని కూడా మీకు అందిస్తుంది. నిద్రపోయే ముందు అశ్వగంధ పాలను తాగండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రా నాణ్యత కూడా పెరుగుతుంది.


పసుపు పాలు
పాలల్లో పసుపు కలుపుకొని తాగే అలవాటు ఎప్పటినుంచో ఉంది. దీన్ని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. కానీ నేటి యువత మాత్రం ఈ పసుపు కలిపిన పాలు తాగేందుకు ఇష్టపడడం లేదు. ఇలా తాగడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడతారు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే మీ మానసిక స్థితి మెరుగవుతుంది. నిద్ర హాయిగా పడుతుంది. సెరటోనిన్, మెలటోనిన్ అనే రెండు హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అయ్యి నిద్ర వచ్చేలా చేస్తాయి.

కుంకుమపువ్వు పాలు
పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకొని తాగడం అనేది మన దేశంలో పూర్వకాలంలోనే ఉంది. కానీ గర్భిణీలు మాత్రమే ఇలా తాగుతారని అనుకుంటారు. నిజానికి కుంకుమపువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి నిద్రను ప్రేరేపిస్తాయి. పాలల్లో రెండు రేకుల కుంకుమ పువ్వులు వేసి బాగా కలుపుకొని తాగండి. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, సాఫ్రానల్ వంటి క్రియాశీల సమ్మేళనాలు మానసిక మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని, మానసిక ఆందోళన తగ్గిస్తాయి. నిద్రలేమి మానసిక ఒత్తిడి రాకుండా కాపాడతాయి.

తులసి టీ
హిందువుల ఇంట్లో తులసి మొక్క ఉండడం ఆచారంగా మారిపోయింది. ఈ పవిత్రమైన తులసి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుంటుంది. భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మూలికల్లో తులసి కూడా ఒకటని నమ్ముతారు. దీనిలో అడాప్టోజెనిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ తులసి ఆకులు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మనసును, శరీరం రెండింటిపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రా నాణ్యతను మెరుగుపరుస్తుంది.

బాదంపాలు
బాదంపప్పు నుంచి తయారు చేసేది బాదంపాలు. ఈ బాదంపప్పులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉంటే నిద్రా నాణ్యత కూడా పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. బాదంపాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకుని బాగా కలుపుకోండి. వాటిని తాగితే మీ నాడీ వ్యవస్థ శాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది. మీరు కొన్ని రోజులపాటు ఈ బాదంపాలు, జాజికాయ పొడి కలుపుకొని తాగి చూడండి. మీకు కచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మునగాకు టీ
మునగాకులు విరివిగా మార్కెట్లో లభిస్తాయి. ఈ మునగాకులను ఏరి కడిగి వాటితో టీ పెట్టుకుని నిద్రపోవడానికి ముందు తాగేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి, ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా మునగాకును ఎంతో ఉపయోగిస్తారు. మన శరీరానికి అత్యవసరమైన సెరటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లం దీనిలో ఉంటుంది. ఇది నిద్రను నియంత్రించే మెలటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది.

పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒక పానీయాన్ని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

Also Read: బెల్లీ ఫ్యాట్ ఎంతకీ తగ్గడం లేదా.. ఈ డ్రింక్స్‌తో బెస్ట్ రిజల్ట్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×