Nagarjuna: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నటులలో ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ ఒకరు. ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో అద్భుతమైన సినిమాలను తన కెరీర్ లో చేసుకుంటూ వచ్చారు. ఏఎన్ఆర్ అంటే ఒక బ్రాండ్. ప్రేమ్ నగర్, దేవదాస్, మూగమనసులు వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆయన కెరీర్ లో ఉన్నాయి. ఎన్నో విలక్షణమైన పాత్రలను కూడా ఆయన చేశారు. ప్రస్తుతం అందరూ మెగాస్టార్ చిరంజీవి డాన్స్ మూమెంట్స్ గురించి మాట్లాడుతారు కానీ.. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డాన్స్ మొదలు పెట్టింది అక్కినేని నాగేశ్వరరావు. అంతేకాకుండా ఎన్నో స్త్రీల పాత్రలను కూడా ఆయన చేశారు. అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీలోకి స్త్రీలు ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్దగా జరగలేదు. ఆ రోజుల్లో స్త్రీ పాత్రలను మొదట ఆయన చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రోజుల్లో స్త్రీ పాత్రలను చేస్తున్నందుకు చాలామంది అక్కినేని నాగేశ్వరరావుని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఆఖరికి ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసే వరకు వెళ్ళింది.
ఈ విషయాన్ని స్వయంగా కింగ్ నాగార్జున ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో మాట్లాడుతూ తెలిపారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు స్త్రీల పాత్రల గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు అంటూ తెలిపాడు. అంతేకాకుండా సముద్రపు నీటిలో కూడా కొంతవరకు వెళ్లి తర్వాత తనకు తాను సర్ది చెప్పుకొని వెనక్కు వచ్చారు అని నాగార్జున చెప్పుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ఎన్నో సినిమాలుకు ఇప్పటికీ కూడా మంచి కల్ట్ స్టేటస్ ఉంది. నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కూడా గతంలో అక్కినేని నాగేశ్వరరావు చేసిన దేవదాస్ సినిమాతో పోలుస్తారు.
Also Read: Tamanaih Bhatia : పెళ్లికి ముందే తమన్నా షాకింగ్ నిర్ణయం..?
అయితే ఈ తరం నటులతో కూడా చాలామందితో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. కేవలం ఆన్ స్టేజ్ పై కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆయన మాట్లాడే మాటలు చాలామందికి ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి. అలానే ఆయన కొన్ని విషయాలను తీసుకునే విధానం కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మంచి మోహన్ బాబు లాంటి వ్యక్తులు కూడా అక్కినేని నాగేశ్వరరావు కంటే నేను చాలా పెద్ద నటుడిని అని చెప్పుకున్న రోజుల్లో కూడా ఆయన ఆన్ స్టేజ్ పై ధీటుగా సమాధానం చెప్పారు. ఏదేమైనా కూడా తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టిన అతి కొద్ది మంది నటులలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ లెగిసిని కంటిన్యూ చేస్తూ చాలామంది నటులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.