BigTV English

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డితో స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌చ‌ర్లలో తాము ప‌ర్య‌టించి ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్క‌డ రెండు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని సీఎంకు చెప్పారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. రైతుల త‌ర‌ఫున విన‌తీప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను నేనే ఎందుకు ఇబ్బంది పెడ‌తాన‌ని సీఎం వారితో చెప్పారు.


Also read: షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్

కొడంగల్ ఓ ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాద‌ని, ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ అని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే త‌న ఉద్దేశమ‌ని తెలిపారు. కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లే ఏర్పాటు చేస్తామ‌ని, భూసేక‌ర‌ణ ప‌రిహారం పెంపును ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు. ల‌గ‌చ‌ర్ల‌లోని భూముల‌నే తీసుకోవాల‌ని లేద‌ని ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపారు. రైతుల బాధ‌లు త‌న‌కు తెలుసని, త‌ను కూడా రైతు కుటుంబం నుండే వ‌చ్చాన‌ని అన్నారు. అమాయక రైతులపై కేసుల విషయం లో పరిశీలిస్తామ‌ని చెప్పారు. కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు.


మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా చాలా వెన‌క‌బ‌డింద‌ని యువ‌త‌కు ఉపాధి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని సీఎం క‌మ్యూనిస్టుల నేత‌ల‌కు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. భూముల సేక‌ర‌ణ‌లో మార్పులు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వామ‌ప‌క్ష నేత‌లు ఇచ్చిన రిపోర్టును ప‌రిశీలిస్తామ‌ని సీఎం తెలిపారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వం కుట్ర చేస్తున్నాయ‌ని నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×