E-Paper
Advertisement

Walking: బరువు తగ్గాలంటే ఉదయాన్నే నడవాలా ? లేదా తిన్న తర్వాతా ?

Walking: బరువు తగ్గాలంటే ఉదయాన్నే నడవాలా ? లేదా తిన్న తర్వాతా ?
Advertisement

 

Walking: వాకింగ్ అనేది మన రోజువారీ జీవితంలో అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. అయితే.. వాకింగ్‌ను ఖాళీ కడుపుతో చేయాలా, లేక భోజనం చేసిన తర్వాత చేయాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు విధానాలకూ వాటి వాటి ప్రయోజనాలు, కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని.. మీ లక్ష్యానికి ఏది ఉత్తమమో తెలుసుకుందాం.

Advertisement

1. ఖాళీ కడుపుతో వాకింగ్:
దీనిని సాధారణంగా ఫాస్టెడ్ కార్డియో అని పిలుస్తారు. ఉదయం నిద్ర లేవగానే.. కాఫీ లేదా టీ మినహా ఆహారం తీసుకోకుండా నడవడం మంచిదని చెబుతుంటారు.

ప్రయోజనాలు:
కొవ్వు : రాత్రి తర్వాత శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఈ స్థితిలో నడిచినప్పుడు.. శరీరం తక్షణ శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగించుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా సహాయ పడుతుంది.

Advertisement

జీవక్రియ మెరుగుదల: ఉదయం వ్యాయామం చేయడం వల్ల రోజు మొత్తం జీవక్రియ చురుకుగా ఉంటుంది.

మానసిక చురుకుదనం: ఉదయాన్నే నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై, రోజంతా మానసికంగా చురుకుగా, ఉల్లాసంగా ఉండటానికి సహాయ పడుతుంది.

పరిమితులు:
శక్తి తగ్గడం:ఎక్కువ దూరం లేదా అధిక వేగంతో నడవడానికి శక్తి సరిపోకపోవచ్చు, త్వరగా అలసిపోవచ్చు.

కండరాలు : కొన్నిసార్లు, కొవ్వుతో పాటు కొద్ది మొత్తంలో కండరాలను కూడా శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది.

షుగర్ పేషెంట్లు: రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీనిని ఆచరించాలి.

2. భోజనం తర్వాత వాకింగ్ :
భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు.. నెమ్మదిగా నడవడం మంచిది.

ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర నియంత్రణ: ఇది అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. తిన్న వెంటనే నడవడం వల్ల రతంలోకి చక్కెర (గ్లూకోజ్) విడుదల నెమ్మదిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రయోజనకరం. ఇది టైప్ డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల : వాకింగ్ జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం లేదా అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఫలితంగా ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది.

మెరుగైన శక్తి: శరీరంలో తగినంత గ్లూకోజ్ నిల్వలు ఉంటాయి కాబట్టి.. భోజనం తర్వాత నడిచేటప్పుడు ఎక్కువ శక్తిని ఉపయోగించవచ్చు.

Also Read: పెదాలు నల్లగా మారాయా ? ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్

పరిమితులు:
సమయం ముఖ్యం: భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా అధిక వ్యాయామం చేయడం కడుపు నొప్పికి లేదా అజీర్తికి దారితీయవచ్చు. అందుకే నెమ్మదిగా నడవాలి.

కొవ్వు : ఖాళీ కడుపుతో పోలిస్తే.. ఇక్కడ శరీరం తక్షణ శక్తి కోసం ఆహారం ద్వారా లభించిన గ్లూకోజ్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి కొవ్వు కరగడం తక్కువగా ఉంటుంది.

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×