E-Paper
Advertisement

సాయంత్రం వేడివేడి సమోసాలు, బజ్జీలు తినాలనిపిస్తోందా?అసలు కారణం ఇదే!

సాయంత్రం వేడివేడి సమోసాలు, బజ్జీలు తినాలనిపిస్తోందా?అసలు కారణం ఇదే!
Advertisement

Evening Cravings: బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యారా …అయినా కూడా సాయంత్రం కాగానే మనసు చిరు తిండి వైపు లాగేస్తుందా..ఖచ్చితంగా ఏదోకటి తోసేయమని కడుపు మారాం చేస్తుందా ..ఆరు దాటిందో లేదో సమోసాలు, బజ్జీలు, పానీపూరి కావాలని మనసు ఉబలాట పడుతుందా ..చేతికి చిక్కిన స్వీట్లు తినాలనే కోరిక ఒక్కసారిగా ముంచుకొస్తుందా ..అయితే వీటికి గల కారణాలని ఒకసారి తెలుసుకుందాం పదండి.

ఇదంతా హార్మోన్స్ ఆడే ఆట 

Advertisement

మన శరీరంలో ఆకలిని నియంత్రించడానికి రెండు ముఖ్యమైన హార్మోన్లు పనిచేస్తాయి. ఒకటి ఆకలిని పెంచే ఘ్రెలిన్ (Ghrelin), మరొకటి కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే లెప్టిన్ (Leptin). ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చురుగ్గా ఉండే మన శరీరం, సాయంత్రానికి వచ్చేసరికి సహజంగానే అలసటకు గురవుతుంది. ఈ క్రమంలో శరీరంలో లెప్టిన్ స్థాయిలు తగ్గిపోతూ, ఘ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దీనికి తోడు రోజంతా ఆఫీస్ పనుల్లోనో, ఇంటి పనుల్లోనో అలసిపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. అప్పుడు మెదడుకు తక్షణ శక్తి (ఇన్‌స్టంట్ ఎనర్జీ) అవసరమవుతుంది. ఆ తక్షణ శక్తి కేవలం సింపుల్ కార్బోహైడ్రేట్లు, రిఫైండ్ చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ ద్వారానే లభిస్తుందని మెదడు రసాయన సంకేతాలు పంపుతుంది. అందుకే ఆ సమయంలో ఆపిల్ ముక్కల కంటే కూడా వేడివేడి సమోసాల మీదే మనసు లాగుతుందన్న మాట.

also read :అల్లు అర్జున్ ఇంట్లో ఆర్‌సీబీ స్టార్ సందడి.. అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ స్పెషల్ సర్ప్రైజ్!

Advertisement

డోపమైన్ అనే రసాయనాన్నిరిలీజ్ చేసే మెదడు 

మరో ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా ..మానసిక ఒత్తిడి.యస్..రోజంతా పని ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత, సాయంత్రానికి కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి, మనసుకు కాస్త ‘ గుడ్’ ఫీల్ ని ఇవ్వడానికి మెదడు డోపమైన్ అనే రసాయనాన్నిరిలీజ్ చేసే ఆహారపదార్థాలను కోరుకుంటుంది. సాధారణంగా కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తిన్నప్పుడే ఈ డోపమైన్ ఎక్కువగా విడుదలై ఇన్ స్టంట్ హ్యాపీ నెస్ ని ఇస్తుంది. దీనికి తోడు చాలా మంది మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తిని, ప్రోటీన్లను సరిగ్గా తీసుకోరు. దీనివల్ల మధ్యాహ్నం తిన్న ఆహారం జీర్ణమై సాయంత్రానికి ఇన్సులిన్ స్థాయిల్లో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు వస్తాయి. దీని వల్ల కూడా కడుపు ఏదోకటి కావాలని మారాం చేస్తుంది.

అస్సలు మంచిది కాదండోయ్

అయితే, ఇలాంటి సమయాల్లో ఆకలిని చంపేయాలని ప్రయత్నించడం అస్సలు మంచిది కాదండోయ్. సాయంత్రం ఆకలిని ఎంతగా కంట్రోల్ చేస్తే రాత్రి డిన్నర్ సమయానికి అంతకు డబల్ తింటారు దీనివల్ల బరువు తగ్గడం పక్కన పెడితే, రాత్రి పూట జీర్ణక్రియ పూర్తిగా దెబ్బతిని నిద్ర పట్టకపోవడం, గ్యాస్ సమస్యలు లాంటివి వస్తాయి.కాబట్టి సాయంత్రం పూట వచ్చే క్రేవింగ్స్‌ను తెలివిగా ఎదుర్కోవాలే తప్ప, కడుపు మార్చుకోకూడదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక సులువైన మార్గం ఉంది. మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఉండే ఈ గ్యాప్ లో మీ శరీరానికి స్మార్ట్ స్నాకింగ్ అలవాటు చేయాలి.

also read :పెట్రోల్ బైకులకు కాలం చెల్లినట్లే.. రూ. 99,999 కే 180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

ముఖ్యంగా ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెరగనివ్వకుండా చాలా నిదానంగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి. ఫలితంగా కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి, జంక్ ఫుడ్ వైపు చూపు పడకుండా చేస్తుంది.

ఉప్మా లేదా కూరగాయలు వేసిన సూప్స్

సాయంత్రం వేళల్లో బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్, ప్యాకేజ్డ్ నూడుల్స్, వేపుళ్లకు దూరంగా ఉండాలి. వాటి స్థానంలో గుప్పెడు నట్స్ (బాదం, వాల్‌నట్స్, పిస్తా), కాస్త గ్రీక్ పెరుగులో పండ్ల ముక్కలు లేదా బెర్రీలు వేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి. మన దేశీయ ఆహారాలైన వేయించిన శనగలు, ఉడికించిన శనగల చాట్, మఖానా (తామర గింజలు), లేదా మొలకెత్తిన గింజల సలాడ్ వంటివి తీసుకుంటే మరీ మంచిది. ఒకవేళ వేడిగా, కాస్త కారంగా తినాలనిపిస్తే ఓట్స్‌తో చేసిన ఉప్మా లేదా కూరగాయలు వేసిన సూప్స్ తీసుకోవచ్చు కూడా.

also read :ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్.. వరుణ్ కొత్త సినిమా కథ లీక్.. ట్రైలర్ చూశారా?

అలాగే శరీరంలో డీహైడ్రేషన్ వల్ల కూడా కొన్నిసార్లు ఆకలిగా అనిపిస్తుంది. అందుకే సాయంత్రం క్రేవింగ్స్ రాగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా గ్రీన్ టీ, మజ్జిగ తాగడం వల్ల కూడా ఆకలి అదుపులోకి వస్తుంది. బరువు తగ్గడం అంటే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదు, శరీరంలో జరిగే ఈ సహజమైన హార్మోన్ల మార్పులను అర్థం చేసుకుని, సరైన సమయంలో సరైన ఫుడ్ ని సెలెక్ట్ చేసుకోవడమే..ఇప్పటికైనా సాయంత్రం ఎందుకు మనసు చిరు తిండి వైపు లాగుతుందో అర్థమయిందా !

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×