E-Paper
Advertisement

లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. రూ. 214 లక్షల కోట్ల అప్పు ఎందుకు? అసలు నిజాలు ఇవే!

లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. రూ. 214 లక్షల కోట్ల అప్పు ఎందుకు? అసలు నిజాలు ఇవే!
Advertisement

India Economy: రూ.214 లక్షల కోట్లు.. ఇది ఇండియా అప్పు! రూ.28 లక్షల కోట్లు.. ఇది భారత్ ఆదాయం! 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న సీన్ వేరు. ఇప్పుడు కనిపిస్తున్న సీన్ వేరు. ఇప్పుడు ఆదాయం పెరిగింది.. అందుకు తగ్గట్లుగానే అప్పులు కూడా పెరిగాయ్. మరి.. పెరిగిన అప్పు, పన్నుల ఆదాయం ఎటుపోతోంది? ఇదే.. ఇప్పుడు ఇండియా డౌట్. డీటెయిల్డ్‌గా చూద్దామా?

భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎటు?

దేశం ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్న వేళ.. దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చ మొదలైంది. అందువల్లే.. అప్పులు, ఆదాయాల లెక్క తీస్తున్నారు భారతీయులు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రధానిగా నరేంద్రమోడీ అధికార బాధ్యతలు చేపట్టినప్పుడు.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యూపీఏ పాలన చివరి దశలో అధిక ద్రవ్యోల్బణం, అధిక ఆర్థిక లోటు, పెట్టుబడుల్లో మందగమనం లాంటి సమస్యలున్నాయ్. జీడీపీ వృద్ధి రేటు కూడా సుమారు 5 నుంచి 6 శాతం స్థాయిలో ఉండేది.

12 ఏళ్లలో భారత్ ఆర్థిక దూకుడు

Advertisement

అప్పటి నుంచి ఇప్పటివరకు.. 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. కానీ, కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, అప్పులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయ్. 2014లో మోడీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన పాలసీ పక్షవాతం, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

భారత జీడీపీ రెట్టింపు ప్రయాణం

ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలున్న.. ఫ్రాజిల్ ఫైవ్ లిస్టులో చేర్చారు. 2014లో భారత జీడీపీ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉండి, ప్రపంచంలో పదో స్థానంలో ఉండేది. గడిచిన కొన్నేళ్లలో.. కరోనా లాంటి మహమ్మారి, ప్రపంచ సంక్షోభాన్ని తట్టుకొని.. భారత్ ముందుకు సాగింది. ప్రస్తుతం.. భారతదేశం దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ని దాటుతూ.. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశఆలను వెనక్కి నెట్టి.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

భారత్ అప్పులపై దేశవ్యాప్తంగా చర్చ

Advertisement

దేశంలో ఇప్పుడు అత్యంత తీవ్రంగా సాగుతున్న చర్చ.. భారత్ అప్పుల గురించే. ప్రధాని మోడీ హయాంలో అప్పులు భారీగా పెరిగాయనేది వాస్తవం. గత మార్చ్ 31 నాటికే 200 లక్షల కోట్ల అప్పులుంటే.. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి.. 220 లక్షల కోట్లు దాటొచ్చనే అంచనాలున్నాయ్. అయితే, ఆర్థికవేత్తల ప్రకారం కేవలం అప్పుల సంఖ్యను మాత్రమే చూడకూడదు. దానిని దేశ జీడీపీ పరిమాణంతో పోల్చి చూడాలి. కోవిడ్ సమయంలో 80 శాతం పైగా చేరిన డెబ్ట్-టు-జీడీపీ నిష్పత్తిని ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తోంది.

డెబ్ట్-టు-జీడీపీ తగ్గింపే లక్ష్యం

2025-26లో ఇది 56 శాతంగా ఉండగా.. 2026-27 బడ్జెట్ నాటికి దీనిని 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030-31 నాటికి దీనిని 50 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పులు పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు కూడా 12 ఏళ్లలో బాగా పెరిగాయి. ముఖ్యంగా జీఎస్టీ అమలు, డిజిటలైజేషన్ పన్నుల వసూళ్లను విప్లవాత్మకంగా మార్చేశాయ్. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు దాదాపు 29 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. అప్పులు కాకుండా పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం 36 లక్షల కోట్లుగా ఉంది. ప్రతి నెలా సగటున లక్షన్నర కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు జీఎస్టీ వసూళ్లు రావడం.. దేశీయంగా వాణిజ్య వృద్ధికి తోడ్పడుతోంది.

లక్షల కోట్ల ఖర్చుతో అభివృద్ధి

ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు.. కేవలం సంక్షేమ పథకాలకో, రోజువారీ ఖర్చులకో వాడకుండా.. హైవేలు, రైల్వేలు, పోర్టులు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తోంది. దీనివల్ల.. దీర్ఘకాలంలో ఆస్తుల సృష్టి జరుగుతుంది. 2015 నుంచి ఇప్పటివరకు.. కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద లక్షల కోట్లు ఖర్చు చేసింది. గడిచిన కొన్నేళ్లలో.. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 72 లక్షల కోట్లకు పైనే ఉంది. ఆహార సబ్సిడీ కింద 25 లక్షల 20 వేల కోట్లు, ఎరువుల సబ్సిడీకి 15 లక్షల 33 వేల కోట్లు, ఉపాధి హామీ కోసం దాదాపు 9 లక్షల కోట్లు, పీఎం కిసాన్ కోసం ఐదున్నర లక్షల కోట్లు ఖర్చు చేసింది. గడిచిన 12 ఏళ్లలో భారత్ మాక్రో ఎకానమిక్ స్టెబిలిటీ సాధించింది. డిజిటల్ ఎకానమీలో వరల్డ్ లీడర్‌గా ఎదిగింది.

వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు

ఇన్‌ఫ్రా బూమ్, ఎక్స్‌పోర్ట్ డైవర్సిఫికేషన్ జరిగాయి. కానీ ఉపాధి సృష్టి, మాన్యుఫాక్చరింగ్, రూరల్ డిమాండ్ లాంటి సవాళ్లు మిగిలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 టార్గెట్‌తో ముందుకెళ్తోంది. వృద్ధి రేటు 7 పర్సెంట్ ప్లస్ నిలబెట్టుకోవాలంటే.. సంస్కరణలు కొనసాగించాలి. ఉపాధి ఫోకస్ పెంచాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఎంత కీలకమో, గ్లోబల్ ఫ్యాక్టర్లు, రాజకీయ స్థిరత్వం, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా కీలకమే. డేటా ప్రకారం మెరుగైన స్థితి ఉంది. కానీ, సమస్యలు కూడా ఉన్నాయ్. ఇప్పుడు.. ఆర్థిక సంక్షోభం చుట్టేయబోతోందనే సంకేతాలతో.. భారత్ ఎంత మేర సిద్ధంగా ఉందనే దానిపై చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ డబ్బంతా ఎటు పోతోంది?

దేశంలో అప్పులు పెరుగుతున్నాయి.. దానికి సమాంతరంగా పన్నుల ద్వారా ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సామాన్యుడికి వచ్చే అనుమానం ఒక్కటే.. ఆదాయం పెరుగుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఆ డబ్బంతా ఎటు పోతోంది? ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దేశం మొత్తం అప్పు 62 లక్షల కోట్ల నుంచి 214 లక్షల కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం కూడా 6 లక్షల కోట్ల నుంచి 26 లక్షల కోట్లకు పెరిగింది. ఇన్నేళ్లలో.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలిపి పెట్టిన ఖర్చు కన్నా.. చేసిన అప్పు 21 లక్షల కోట్లు ఎక్కువగా కనిపిస్తోంది. సొంత ఆదాయం పెరిగినా.. ఆ డబ్బంతా ఏమైపోతోందనేదే ఇప్పుడు మెయిన్ డౌట్.

ప్రభుత్వ ఆదాయం ఎటు వెళ్తోంది..?

ప్రభుత్వం చేసే అప్పులు, వచ్చే ఆదాయం అంతా మూడు పెద్ద రంగాల్లోకి వెళ్తుంటాయి. వీటిని మనం కనిపించే ఖర్చులు, కనిపించని ఖర్చులుగా విభజించొచ్చు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని భారీగా పెంచింది. జాతీయ రహదారులు, రైల్వేల ఆధునీకరణ, పోర్టులు, ఎయిర్‌పోర్టులు.. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తు అభివృద్ధికి పునాది. ప్రభుత్వం సంపాదించే ఆదాయంలో సింహభాగం గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. ప్రస్తుత బడ్జెట్లలో దాదాపు 20 శాతానికి పైగా కేవలం వడ్డీల చెల్లింపులకే పోతోంది.

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో

ఇదే క్రమంలో.. ఉచిత రేషన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, ఎరువులు, ఆహార సబ్సిడీల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. జీఎస్టీ వసూళ్లతో ఆదాయం పెరిగినా.. దేశ అవసరాలు, ప్రభుత్వ ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయ్. సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో ఆధునిక ఆయుధాల కొనుగోలుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో 41 శాతానికి పైగా నిధులను ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు బదిలీ చేయాలి. కాబట్టి.. కేంద్రం దగ్గర మిగిలేది తక్కువే అంటున్నారు.

సామాన్యుడిపై ఆర్థిక భారం

భారత్ ప్రస్తుతానికి ఆర్థిక సంక్షోభంలో లేదు. అయినప్పటికీ, సామాన్యుడికి ఇబ్బందులు తప్పట్లేదు. జీడీపీ పెరుగుతున్నా, దానికి తగ్గట్లుగా యువతకు ఉద్యోగాలు రావడం లేదు. నిరుద్యోగం వల్ల
కొనుగోలు శక్తి తగ్గుతోంది. నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల సామాన్యుడి ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతోంది, దాంతో పొదుపు తగ్గుతోంది. మరోవైపు.. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ఎఫెక్ట్ ఇండియాపై కనిపించడం మొదలైంది. ఇప్పటికే.. చమురు ధరలు మండిపోతుండటంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయ్. ఫలితంగా.. రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత క్షీణిస్తోంది. దీంతో.. దిగుమతులు ఖరీదుగా మారుతున్నాయ్. సంక్షోభ భయాల వల్ల.. విదేశీ ఇన్వెస్టర్లు.. భారత మార్కెట్ల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశాలున్నాయి.

చైనా ప్లస్ వన్‌తో భారత్‌కు అవకాశాలు

భారత్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశంలో భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు, బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ.. ఎలాంటి సంక్షోభాన్ని అయినా తట్టుకునే రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. చైనా ప్లస్ వన్ పాలసీ వల్ల గ్లోబల్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఏదేమైనా.. ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయాలు మన చేతుల్లో లేవు. యుద్ధం మళ్లీ మొదలైతే.. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్‌లో కోత పెట్టాల్సి వస్తుంది. ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటికిప్పుడు ఇండియా ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మన అంతర్గత వినియోగం చాలా ఎక్కువ. కానీ, అంతర్జాతీయ యుద్ధాలు, పెరుగుతున్న అప్పుల భారం వల్ల రాబోయే కొన్నేళ్ల పాటు వృద్ధి రేటు అనుకున్న స్థాయిలో వేగంగా ఉండకపోవచ్చు. ప్రభుత్వం కేవలం జీడీపీ అంకెలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెడితేనే.. దీని నుంచి బయటపడగలమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×