E-Paper
Advertisement

Fenugreeks Benefits : మెంతులతో మెండుగా ఆరోగ్యం

Fenugreeks Benefits : మెంతులతో మెండుగా ఆరోగ్యం
Advertisement
Fenugreeks Benefits

Fenugreeks Benefits : మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటిని మన ఆహారంలో భాగం చేశారు పెద్దలు. అధిక బ‌రువు ఉన్నవారు ఈ మెంతుల‌ను నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని తాగితే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫ్లేవ‌నాయిడ్స్ మన పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును క‌రిగిస్తుంది. విరేచ‌నాల‌తో బాధ‌ప‌డుతుంటే మ‌జ్జిగ‌లో మెంతుల‌ పౌడర్‌ వేసుకుని తాగితే తగ్గిపోతాయి.

రాత్రి నాన‌బెట్టిన మెంతుల‌ను ఉద‌యం తింటే గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. గ‌ర్భాశ‌య స‌మ‌స్యలు ఉన్న స్త్రీలు మెంతులు తింటే చక్కని ఔషధంగా ఇవి పనిచేస్తాయి. నాన‌బెట్టిన మెంతుల్ని త‌గిన మోతాదులో తీసుకుంటే నెల‌స‌రి క్రమం త‌ప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే నొప్పికూడా తగ్గుతుంది.

Advertisement

అలాగే నీళ్లలో మెంతుల పొడి క‌లుపుకొని తాగితే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే వికారం, త‌ల‌నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మెంతుల పొడిని పాల‌ను క‌లిపి ముఖంపై రాసి మసాజ్‌ చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడుకుంటే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

మెంతుల‌ను నాన‌బెట్టి ఉడికించి వ‌డ‌క‌ట్టాలి. తర్వాత ఆ నీటిలో దూదినిముంచి ముఖంపై రాసుకుంటే మొటిమ‌లు, న‌ల్లని మ‌చ్చలు పోతాయి. నాన‌బెట్టిన మెంతుల‌ను పేస్ట్‌గా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. అలాగే కొబ్బరి నూనెలో మెంతి పొడి వేసి త‌ల‌కు పెట్టుకుంటే చుండ్రు స‌మ‌స్య నుండి బయటపడవచ్చు. ఇలా మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×