E-Paper
Advertisement

ఒక్క క్యాప్సూల్‌తో ఎన్ని ఆరోగ్య లాభాలో.. గుండె, మెదుడు, కీళ్లనొప్పి సమస్యలన్నింటికీ ఒకే ఔషధం

ఒక్క క్యాప్సూల్‌తో ఎన్ని ఆరోగ్య లాభాలో.. గుండె, మెదుడు, కీళ్లనొప్పి సమస్యలన్నింటికీ ఒకే ఔషధం
Advertisement

Fish Oil Health Benefits| సరైన జీవనశైలితో పాటు మంచి పోషకాహారం తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే ఉరుకు పరుగుల జీవనంలో త్వర త్వరగా దొరికింది తినేయడం, సరిగా నిద్రలేకపోవడం, పని, మానసిక ఒత్తిడి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. ముఖ్యంగా రక్తపోటు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కంటిచూపు సమస్యలు. తాజాగా ఇలాంటి సమస్యలకు నివారణగా ఫిష్ ఆయిల్ లోని పోషకాలు బాగా సాయపడతాయి.

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇప్పుడు చాలా ప్రముఖ ఆరోగ్య సప్లిమెంట్‌లుగా మారాయి. చాలా మంది గుండె మరియు మెదడు ఆరోగ్యం కోసం ఇవి తీసుకుంటున్నారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 మన శరీరానికి చాలా అవసరమైన పోషకం. మానవ శరీరం ఒమేగా 3 యాసిడ్స్ స్వయంగా తయారు చేయలేదు. కాబట్టి ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి. సాల్మన్, మాకెరెల్ వంటి చేపల నుంచి ఫిష్ ఆయిల్ వస్తుంది.

Advertisement

ఫిష్ ఆయిల్ ఎందుకు ముఖ్యం

ఫిష్ ఆయిల్‌లో EPA, DHA అనే రెండు రకాల ఒమేగా 3 ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేపలు తినని వారికి ఒమేగా-3 లోపం ఏర్పడవచ్చు. అలాంటి వారు సప్లిమెంట్స్ ద్వారా ఈ లోపాన్ని తీర్చుకోవచ్చు.

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గిస్తుంది. రక్తపోటును కొంతవరకు తగ్గించవచ్చు. గుండె నుంచి రక్తం సరఫరా చేసే నాళాల్లో ప్లాక్ ఏర్పడకుండా సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి, డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పి, వాపును తగ్గిస్తుంది. చర్మంలో తేమ ఉంచడానికి, చర్మ సమస్యలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.

ఎవరు ఫిష్ ఆయిల్ తీసుకోవాలి

చేపలు ఎక్కువగా తినని వారు కచ్చితంగా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవాలి. గుండె సమస్యలు ఉన్నవారు దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. ఇది బిడ్డ మెదడు, కళ్ల అభివృద్ధికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పి ఉన్నవారు, వయసు పైబడినవారు కూడా దీని నుంచి లాభం పొందవచ్చు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి

సీఫుడ్ అలర్జీ ఉన్నవారు ఫిష్ ఆయిల్ తీసుకోకూడదు. రక్తం పలచబడే చేసే మందులు తీసుకునేవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకుంటే కడుపు అసౌకర్యం, చేపల వాసన వంటి సమస్యలు రావచ్చు.

Also Read: మేకప్ లేకుండా మెరిసిపోయే చర్మం.. ఆయుర్వేదిక్ నైట్ సీరమ్‌తో ముఖంపై మచ్చలు మాయం

సహజ ఆహారం vs సప్లిమెంట్స్

వారానికి రెండు సార్లు చేపలు తినడం బెస్ట్. కానీ ఆహారం ద్వారా సరిపడా ఒమేగా-3 రాకపోతే సప్లిమెంట్స్ సహాయపడతాయి. ఎప్పుడూ మంచి క్వాలిటీగల ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ మాత్రమే వాడాలి.

సురక్షితంగా ఉపయోగించడానికి చిట్కాలు

భోజనంతో పాటు క్యాప్సూల్స్ తీసుకోండి. లేబుల్‌పై ఉన్న మోతాదు ప్రకారం మాత్రమే వాడండి. అధిక మోతాదు తీసుకోకండి. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ను అడిగి తీసుకోండి.

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ గుండె, మెదడు, కీళ్లు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఇవి అన్ని సమస్యలకు మందు కాదు. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎప్పుడూ ముఖ్యం. సప్లిమెంట్స్‌ను తెలివిగా, సరైన విధంగా ఉపయోగించండి.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×