E-Paper
Advertisement

Green Tea Side Effects: గ్రీన్ టీతో బరువు తగ్గడం పక్కన పెడితే.. ఈ 4 అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ!

Green Tea Side Effects: గ్రీన్ టీతో బరువు తగ్గడం పక్కన పెడితే.. ఈ 4 అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ!
Advertisement

Green Tea Side Effects: గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న మాట వాస్తవమే. బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగుపడటం వంటి ప్రయోజనాలను పొందడానికి చాలామంది దీన్ని అలవాటు చేసుకుంటారు. అయితే, మోతాదుకు మించి ఎక్కువగా గ్రీన్ టీ తాగితే అనారోగ్యానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా తాగితే వచ్చే నష్టాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియపై ప్రభావం:

గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరికి చర్మంపై దద్దుర్లు, నాలుక లేదా గొంతులో దురద వంటి అలర్జీలు కూడా రావచ్చు.

Advertisement

Also Read: రక్తహీనత నుంచి డయాబెటిస్ వరకు.. అన్నింటికీ ముల్బెర్రీ ఒకటే పరిష్కారం!

రక్తహీనత ముప్పు:

భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో ఉండే సమ్మేళనాలు మనం తిన్న ఆహారం నుండి ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కాలక్రమేణా ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.

గుండె వేగంలో మార్పులు:

Advertisement

గ్రీన్ టీలో ఉండే కెఫీన్ మోతాదు మించితే గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం మొదలవుతుంది. గుండె వేగం అకస్మాత్తుగా పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెతెవచ్చు.

ఎసిడిటీ, తలనొప్పి:

గ్రీన్ టీలోని కెఫీన్ తలనొప్పిని తగ్గించినప్పటికీ.. రోజు రెండు కంటే ఎక్కువ సార్లు తీసుకుంటే.. అది శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల కడుపులో మంటతో పాటు, తగ్గాల్సిన తలనొప్పి మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×