E-Paper
Advertisement

RS Praveen Kumar: అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు.. బీజేపీ, కాంగ్రెస్ కలయిక బట్టబయలు.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్

RS Praveen Kumar: అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు.. బీజేపీ, కాంగ్రెస్ కలయిక బట్టబయలు.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
Advertisement

RS Praveen Kumar: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ దొంగల, రాబందులు పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ప్రొటెక్షన్, బీజేపీకి రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ బట్ట బయలు అయిందన్నారు. రాష్ట్రంలో అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇదే విషయంపై తెలంగాణ ప్రజలకు అనుమానం కలుగుతుందన్నారు.

ఒకటే సీటు వచ్చిన కాంగ్రెస్ కు ఆమన్ గల్ లో బీజేపీ మద్దతు ఇచ్చిందని, ఇది వారి ఇద్దరి అక్రమ కలయిక అని ఆర్.ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. దేశంలో మోడీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటిని అక్రమంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్ర చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన కోరం ఉన్నప్పటికీ అధికారులు వాయిదా వేశారని, స్టేట్ ఎలెక్షన్ కమిషన్ ఉన్నది దేనికి అని ప్రశ్నించారు.

Advertisement

అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారుతున్నారని ఆర్.ఎస్ ప్రవీణ్ విమర్శించారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అపిషియో ఓటు వేశారన్నారు. రెండు చోట్ల ఎక్స్ అపిషియో ఓటు రిజిస్టర్ చేసుకుందని, ఆమెకు వరంగల్ ఎంపీగా కడియం కావ్య కొనసాగే నైతిక అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు చోట్ల ఎక్స్ అపిషియో ఓటు నమోదు చేసుకోవడం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ దండే విఠల్ రెండు చోట్ల ఎక్స్ అపిషియో ఓటు రిజస్టర్ చేసుకున్నాడని ఆర్.ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మొదటి నుంచి డ్రామాలు చేస్తుందన్నారు. బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారన్నారు. పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేయాలని కోరారు. జనగాంతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో జరిగిన చైర్మన్ల ఎంపికపై విచారణ చేయాలన్నారు. జనగాం కౌన్సిల్ ఆఫీస్ లోకి పోలీసులు వెళ్లడం అక్రమం అన్నారు.

Advertisement

Also Read: India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?

పార్లమెంట్ , అసెంబ్లీ హాల్లొకి పోలీసులు అలానే వెళ్తారా? అని ఆర్.ఎస్. ప్రవీణ్ నిలదీశారు. ఇది అణిచివేతకు, తిరుగుబాటుకు నాంది పలుకుతుందన్నారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోగ్యం భాగలేక ఇంట్లో ఉంటే కిడ్నాప్ అయ్యాడని ఫిర్యాదు చేశారని, ఎంతటి హాస్యాస్పదమో అర్థమవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలో జరుగుతున్న పరిణామాల పై స్టేట్ ఎలెక్షన్ కమిషన్ కు పిర్యాదు చేస్తామన్నారు.

Also Read: AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×