E-Paper
Advertisement

Bottle Gourd: సొరకాయతో షుగర్ కంట్రోల్.. ఇంకా దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Bottle Gourd: సొరకాయతో షుగర్ కంట్రోల్.. ఇంకా దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు !
Advertisement

Bottle Gourd: పండ్లు, కూరగాయలు, గింజలు, పాలు, పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు నిరూపించాయి. ఈ సహజ ఆహారాలు ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి ఎంతగానో సహాయ పడతాయి. అంతే కాకుండా కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేయగలుగుతాయి. ఈ సహజ ఆహారాలు అనేక అనారోగ్యాలను నివారించడంతో పాటు, తగ్గించే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. సొరకాయ ఔషధ గుణాలు అధికంగా ఉన్న ఆహారాలలో ఒకటి. సొరకాయ ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకీ సొరకాయ తినడంవల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.

Advertisement

సొరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు:

సొరకాయలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

Advertisement

జీర్ణ సమస్యలు:

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే సొరకాయ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ కడుపు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పి:

సొరకాయ తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది తలనొప్పిని తగ్గించడంలో చాలా బాగ సహాయ పడుతుంది.

బట్టతల:

జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యతో మీరు బాధ పడుతుంటే.. సొరకాయ మీకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. సొర కాయ ఆకుల రసాన్ని మీ తలకు అప్లై చేయడం వల్ల బట్ట తల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, దగ్గు:

వాతావరణ మార్పులు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ జలుబు , దగ్గుకు కారణమవుతాయి. ముక్కులో సొర కాయ పొడిని పీల్చడం వల్ల కఫం తొలగిపోతుంది.

సొరకాయ తినడం వల్ల కలిగే నష్టాలు:

విరేచనాలు, వాంతులు: సొరకాయ రసం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. మీరు ఎక్కువగా సొర కాయ రసం తాగితే.. వాంతులు, విరేచనాలతో బాధపడవచ్చు. దీంతో పాటు, జ్యూస్ తయారు చేసేటప్పుడు శుభ్రతను పాటించండి. లేకుంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: చలికాలంలో జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

అధిక రక్తపోటు : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు తక్కువ పరిమాణంలో సొరకాయ జ్యూస్ తాగాలి. సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్త పోటు అసాధారణంగా తగ్గుతుంది. రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల తల తిరుగుతుంది. దృష్టి కూడా మసక బారుతుంది.

డయాబెటిస్ : షుగర్ వ్యాధి గ్రస్తులు సొరకాయను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. సొరకాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలలో అకస్మాత్తుగా తగ్గుదలకు కారణమవుతుంది. ఇది మూర్ఛ పోవడానికి, కొన్ని సందర్భాల్లో హైపో గ్లైసీమియాకు దారితీస్తుంది.

క్యాన్సర్: సొరకాయలో లభించే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Also Read: చలికాలంలో లవంగాలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×