E-Paper
Advertisement

Telangana CEO: రాజకీయ పార్టీలకు ‘డెడ్ లైన్’.. అక్టోబర్ 31 లోపు విరాళాల వివరాలు ఇవ్వాల్సిందే!

Telangana CEO: రాజకీయ పార్టీలకు ‘డెడ్ లైన్’.. అక్టోబర్ 31 లోపు విరాళాల వివరాలు ఇవ్వాల్సిందే!
Advertisement

Telangana CEO: రాజకీయాల్లో పారదర్శకతను పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగానే, తెలంగాణలోని గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (RUPPs) తమ ఆదాయ-వ్యయాల వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. చట్టబద్ధమైన గడువుల లోపు నివేదికలు ఇవ్వని పార్టీలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఆయా పార్టీలు తమ వార్షిక ఆర్థిక నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని శుక్రవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ పారదర్శకత నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన విరాళాల వివరాలను అక్టోబర్ 31వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. అలాగే, ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలను ఆదాయపన్ను (IT) రిటర్న్స్ గడువు ముగిసిన నెల రోజుల్లోపు అందజేయాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన 75 రోజుల్లోపు, లోక్‌సభ ఎన్నికల తర్వాత 90 రోజుల్లోపు నివేదికలు సమర్పించడం తప్పనిసరి అని గుర్తుచేశారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29సీ ప్రకారం ఈ నివేదికలు సమర్పించిన పార్టీలకే ఆదాయపన్ను మినహాయింపులు లభిస్తాయని ఆయన వివరించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే విరాళాల నివేదికలను ఎలాంటి ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోబోమని సెక్షన్ 29సీ(3)ని ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక పార్టీలు నివేదికలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఈ ధోరణి వీడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఈఓ హెచ్చరించారు.

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల ఆర్థిక నివేదికల సమర్పణ ప్రక్రియను సులభతరం చేసేందుకు IEMS (Integrated Election Expenditure Monitoring System) అనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాజకీయ పార్టీలు తమ విరాళాల నివేదికలు, వార్షిక ఆడిట్ ఖాతాలు మరియు ఎన్నికల ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://iems.eci.gov.in/ న‌మోదు చేయాల్సి ఉంటుంది.

Read Also: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×