E-Paper
Advertisement

స్పైసీ ఫుడ్ లవర్స్ బీ కేర్‌ఫుల్! అతిగా కారం తింటే ఈ కష్టాలు తప్పవు

స్పైసీ ఫుడ్ లవర్స్ బీ కేర్‌ఫుల్! అతిగా కారం తింటే ఈ కష్టాలు తప్పవు
Advertisement

Spicy Food Side Effects: మోమోస్ పక్కన ఎర్రటి చట్నీ, బిర్యానీలో ఘాటైన మసాలా, ఇంకా స్పైసీగా ఉండే స్ట్రీట్ ఫుడ్.. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! నేటి యువతకు స్పైసీ ఫుడ్ అంటే ఒక క్రేజ్. కానీ.. ఆ క్షణంలో ఇచ్చే కిక్ తర్వాత మీ కడుపులో ఎలాంటి ‘యుద్ధం’ మొదలవుతుందో తెలుసా? కారం మితిమీరితే అది కేవలం నాలుకకే కాదు, మీ మొత్తం ఆరోగ్యానికే ముప్పు తెస్తుంది. కారం ఎక్కువగా తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో , మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అతిగా కారం తింటున్నారా? మీ బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!

Advertisement

మనం తినే ఆహారంలో తగినంత కారం ఉంటే అది జీవక్రియను పెంచుతుంది. కానీ.. “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు.. అది హద్దులు దాటితే మన శరీరం తట్టుకోలేదు. స్పైసీ ఫుడ్ లవర్స్ ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యలు ఇవే..

1. కడుపులో మంట,ఎసిడిటీ:
కారం ఎక్కువగా ఉండే ఆహారంలో ‘క్యాప్సైసిన్’ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీని వల్ల తిన్న ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉండిపోయి.. యాసిడ్ రిఫ్లక్స్‌కు దారి తీస్తుంది. ఫలితంగా గుండెలో మంట, గొంతులో పుల్లటి తేన్పులు రావడం వంటివి జరుగుతాయి.

Advertisement

2. గ్యాస్ట్రిక్ అల్సర్లు :
చాలా మంది కారం తింటే అల్సర్లు వస్తాయని భయపడతారు. నిజానికి కారం నేరుగా అల్సర్లను కలిగించదు కానీ.. ఇప్పటికే కడుపులో సెన్సిటివ్ లైనింగ్ ఉన్నవారికి కారం తోడైతే అది అల్సర్‌గా మారుతుంది. ఇది తీవ్రమైన కడుపు నొప్పికి, అసౌకర్యానికి కారణమవుతుంది.

3. విరేచనాలు, జీర్ణ సమస్యలు:
అతిగా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు అది పేగులను ఇరిటేట్ చేస్తుంది. శరీరం ఆ ఘాటును తట్టుకోలేక త్వరగా బయటకు పంపేయడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల విరేచనాలు అవుతాయి. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా ఉండే స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

4. నిద్రలేమి :
రాత్రి పూట ఘాటైన భోజనం చేయడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. స్పైసీ ఫుడ్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పైగా ఎసిడిటీ వల్ల హాయిగా పడుకోవడం కష్టమవుతుంది. ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. డిన్నర్‌లో స్పైసీ ఫుడ్ తగ్గించడం మంచిది.

5. చర్మ సమస్యలు:
కారం ఎక్కువగా తినే వారిలో కొందరికి మొటిమలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. జీర్ణ వ్యవస్థలో లోపాలు తలెత్తినప్పుడు అది చర్మంపై ప్రతిబింబిస్తుంది.

Also Read: చిక్కుల జుట్టుతో విసిగిపోయారా? ఈ సమ్మర్ హెయిర్ కేర్ సీక్రెట్స్ మీకోసమే!

జాగ్రత్తలు ఇవే:
పెరుగు లేదా మజ్జిగ: స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది.

నీరు: రోజంతా తగినంత నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

మితంగా తినడం: ఏదైనా రుచి కోసం తినాలి కానీ, కడుపు నిండా కారం నింపేయకూడదు.

స్పైసీ ఫుడ్ తినడం తప్పు కాదు. కానీ అది మీ నియంత్రణలో ఉండాలి. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రుచిని వెతుక్కోవడం తెలివైన పని కాదు. కాబట్టి.. నెక్స్ట్ టైమ్ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు ‘మీడియం స్పైసీ’ అని చెప్పడం మర్చిపోకండి. మీ కడుపుని ప్రశాంతంగా ఉంచండి. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×