Niharika Konidela (Image credit: Instagram)
నిహారిక కొణిదెల.. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మెగా కుటుంబం నుంచి వచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా తనను తాను నిరూపించుకోవాలనుకుంది.

Niharika Konidela (Image credit: Instagram)
అలా సూర్యకాంతం , ఒక మనసు వంటి చిత్రాలు చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది.

Niharika Konidela (Image credit: Instagram)
కెరియర్లో బిజీగా మారుతున్న సమయంలోనే అనుకోకుండా వివాహం చేసుకొని కొన్నాళ్లకే విడాకులు ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అవుతూ బిజీగా మారింది.

Niharika Konidela (Image credit: Instagram)
కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను నిర్మించి సక్సెస్ అందుకున్న ఈమె.. రాకాస అనే మరో చిత్రాన్ని కూడా నిర్మించింది.. ఇక ఇప్పుడు తన అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బరి అనే చిత్రానికి కూడా ఈమె నిర్మాతగా వ్యవహరిస్తుంది.

Niharika Konidela (Image credit: Instagram)
అలా ఒకవైపు నిర్మాతగా బిజీగా మారినా.. మరొకవైపు తన సినిమా ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటున్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది నిహారిక.

Niharika Konidela (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా పెరటిలోని చెట్ల మధ్య ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని తాజాగా అభిమానులతో పంచుకుంది. ఇక ఇందులో చాలా అందంగా ఉంది నిహారిక అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.