E-Paper
Advertisement

Marriage: పెళ్లయ్యాక భార్యాభర్తల్లో హైబీపీ కేసులు పెరిగిపోతున్నాయట, ఎందుకో తెలుసా

Marriage: పెళ్లయ్యాక భార్యాభర్తల్లో హైబీపీ కేసులు పెరిగిపోతున్నాయట, ఎందుకో తెలుసా
Advertisement

ఇటీవల కాలంలో హైబీపీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెళ్లయిన వారిలో ముఖ్యంగా అధిక రక్తపోటు పెరిగిపోతోంది. పెళ్లి చేసుకోవడం వల్ల నిజంగానే రక్తపోటు సమస్య వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా తాజాగా ఒక అంతర్జాతీయ అధ్యయనం బయటికి వచ్చింది. ఈ అధ్యయనం పెళ్లి, దాంపత్య జీవితం, రక్తపోటు మధ్య ఉన్న సంబంధాన్ని ఆసక్తికరంగా వివరించింది.

అన్ని దేశాల్లో హైబీపీ
ఈ పరిశోధనను అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, భారతదేశం వంటి నాలుగు దేశాలకు చెందిన మధ్య వయసు, వృద్ధులైన దంపతుల ఆరోగ్య వివరాలను పరిశీలించారు. వేల మంది భర్తలు, భార్యల డేటాను విశ్లేషించిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే… ఒక దంపతుల్లో ఒకరికి అధిక రక్తపోటు (హై బీపీ) ఉంటే, మరొకరికి కూడా అదే సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది.

Advertisement

మనదేశం పరిస్థితి
అధ్యయనంలో వెల్లడైన గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో దాదాపు 47 శాతం దంపతుల్లో ఇద్దరికీ హై బీపీ ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో ఈ సంఖ్య సుమారు 38 శాతం వరకు ఉంది. చైనాలో దాదాపు 21 శాతం, భారతదేశంలో సుమారు 20 శాతం దంపతుల్లో భర్త, భార్య ఇద్దరికీ రక్తపోటు సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం చెబుతోంది. అంటే దేశాల మధ్య కొంత తేడా ఉన్నప్పటికీ, దాంపత్య జీవితంలో బీపీ ఒకరినుంచి మరొకరికి ప్రభావం చూపుతుందన్న విషయం స్పష్టమవుతోంది.

కారణం ఏమిటి?
పెళ్లి చేసుకున్నంత మాత్రాన బీపీ వచ్చేస్తుందా? అనే సందేహం చాలామందికి వస్తుంది. పెళ్లి అనేది నేరుగా రక్తపోటుకు కారణం కాదని, కానీ పెళ్లి తర్వాత ఏర్పడే జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు వైద్యులు. భర్త, భార్య ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే రకమైన ఆహారం తింటారు. ఒకే విధమైన జీవన అలవాట్లు పాటిస్తారు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా వాడటం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి అంశాలు ఇద్దరిపైనా సమానంగా ప్రభావం చూపుతాయి.

Advertisement

దాంపత్య జీవితంలో వచ్చే బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ సమస్యలు కూడా రక్తపోటును పెంచే అంశాలుగా మారుతాయి. ముఖ్యంగా ఉద్యోగం, పిల్లల చదువు, భవిష్యత్తు ఆలోచనలు వంటి విషయాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ఈ అలవాట్లు, ఒత్తిడులు వల్ల బీపీ వస్తే, అదే వాతావరణంలో ఉన్న మరొకరికి కూడా అదే సమస్య రావడం సహజమేనని నిపుణులు అంటున్నారు.

ఈ అధ్యయనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతోంది. ఒక దంపతుల్లో ఒకరికి బీపీ ఉన్నా కూడా, చాలాసార్లు ఇద్దరూ చికిత్స తీసుకోరు. నాకు మాత్రమే ఉంది అనే భావనతో మరో వ్యక్తి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే దంపతులు ఇద్దరూ కలిసి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. వైద్యులు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమిటంటే… భర్త, భార్య ఇద్దరూ కలిసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజూ కొద్దిసేపైనా నడక, వ్యాయామం చేయాలి. పొగ తాగడం, మద్యం వంటి అలవాట్లను దూరంగా పెట్టాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. అలాగే క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×