E-Paper
Advertisement

Top 20 News: 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్, బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

Top 20 News: 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్, బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

1. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్టును మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జగన్‌ పేరుతో లేఖ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన 16 మంది మావోయిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించింది.

2. ఓటు కోసం వెళ్లి.. దంపతులు మృతి

ములుగు జిల్లాలో ఓటు కోసం వెళ్లి దంపతులు ప్రమాదానికి గురయ్యారు. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపర్ణ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెంద.. ఆమె భర్త దేవేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

3. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పై బదిలీ వేటు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుపై బదిలీ వేటు పడింది. నర్సింగరావుతో పాటు SI అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను సీపీ సజ్జనార్ బదిలీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అవినీతి ఆరోపణలు వస్తున్న వారిపై సీపీ కఠినంగా వ్యవహరిస్తున్నారు.

4. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చామల భేటీ

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరారు. స్వర్ణగిరి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్, యాదాద్రి వంటి కీలక ప్రాంతాలు సమీపంలో ఉన్నందున, ఇక్కడ స్టాపింగ్ ఇస్తే భక్తులు, విద్యార్థులు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరించారు.

5. బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కొమ్ముతండా గ్రామంలో జరిగింది. పురుగుల మందు తాగి భూక్య వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

6. శంషాబాద్‌లో జేఏసీ, విద్యార్తులు భారీ ర్యాలీ

శంషాబాద్‌ మున్సిపాలిటిలో జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. శంషాబాద్‌ డివిజన్‌ను చార్మినార్‌లో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ నేతలు.. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ బచావో..చార్మినార్ హటావో పేరుతో చేపట్టిన ర్యాలీలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

7. ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం భేటీ

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల ఉద్యమం’ పత్రాలను ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు. దీనికి ముందు రేపు ఉదయం పార్టీ కార్యాలయం వద్ద ఈ పత్రాలతో కూడిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్ భవన్‌కు పంపనున్నారు.

8. ఆటో బోల్తా.. కార్మికులకు తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ నుంచి వెల్లంపల్లికి పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

9. విషాదం.. మహిళ సూసైడ్

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అవుషాపూర్‌కు చెందిన మంజుల తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే సరికి ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

10. ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం-కొండపల్లి మున్సిపాలిటీలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో కలిసి వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, హెల్మెట్ లేని వాహనదారులను ఆపి, భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.

11. అదుపుతప్పి లారీ బోల్తా.. చాకచక్యంగా క్లీనర్

అల్లూరి జిల్లా అంగుళూరు సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. క్లీనర్ మాత్రం ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

హనుమకొండ జిల్లా వరికోల్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు.

13. వన్యప్రాణుల రక్షణ కోసం.. కీలక నిర్ణయం

వన్యప్రాణుల రక్షణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి నేషనల్ హైవేపై 5 మిల్లీమీటర్ల మందంతో రెడ్ టేబుల్-టాప్ బ్లాక్ మార్కింగ్స్‌ను ఏర్పాటు చేసింది. అటవీ జంతువులను ఢీకొట్టకుండా.. వాహనదారులను అలర్ట్ చేసేలా NHAI దేశంలోనే మొదటి వన్యప్రాణి సురక్షిత రహదారి ఏర్పాటు చేసింది.

14. చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరుకున్న రూపాయి

భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది. డాలర్ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు, రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతోంది.

15. మంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రపంచ వాణిజ్య ప్రస్తుత తీరుతెన్నులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌లు, ఇతర మార్గాలను ఆయుధంగా మార్చేశారని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే అదే మనల్ని కాపాడుతుందన్నారు.

16. పిటిషనర్ ఆదేశం

ఇండిగో విమాన టికెట్ల రద్దుకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుందని చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ఆ పిటిషన్‌లోనే విషయాన్ని ఇంప్లీడ్ చేసుకోవచ్చని పిటిషనర్‌ను ఆదేశించింది.

17. 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో ఆయా స్కూళ్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ స్కూళ్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

18. తీవ్రమైన కడుపునొప్పితో ఆటగాడు

టీమ్ ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో పుణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. SMAT టోర్నమెంట్‌లో ముంబై తరఫున ఆడుతున్న ఆయన రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ సమస్యకు గురయ్యారు. జైస్వాల్ గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

19. ఇకపై పెళ్లిళ్లో డ్యాన్స్ చేయను..

బిలియనీర్ల పెళ్లిళ్లో ఇకపై తాను డ్యాన్స్ చేయనని బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బిలియనీర్లు వారి వివాహ వేడుకల్లో సెలబ్రిటీలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారని.. ఈ ట్రెండ్‌ను ఇకపై తాను ప్రోత్సహించాలని అనుకోవడం లేదని సృష్టం చేశారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లు ఇప్పటికీ ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నప్పటికీ తాను మాత్రం వారిలా డ్యాన్స్ చేయాలని అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

20. టాలీవుడ్‌లో విషాదం.. యువ దర్శకుడు మృతి

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×