E-Paper
Advertisement

High cholesterol Symptoms: మీ గోళ్లు ఇలా ఉన్నాయా ? అయితే శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నట్లే !

High cholesterol Symptoms: మీ గోళ్లు ఇలా ఉన్నాయా ? అయితే శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నట్లే !
Advertisement

High cholesterol Symptom: అధిక కొలెస్ట్రాల్ అనేది శరీరంలో నిశబ్దంగా వ్యాపించే సమస్య. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త పరీక్ష ద్వారానే తెలుస్తుంది. కానీ మన శరీరంలోని కొన్ని భాగాలు, ముఖ్యంగా గోళ్లు, కొన్ని హెచ్చరిక సంకేతాలను ముందుగానే ఇస్తాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు గోళ్లలో కనిపించే 7 ముఖ్యమైన సంకేతాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. గోళ్లు పాలిపోవడం:

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్తనాళాలు కుంచించుకుపోయి చివరి భాగాలకు (గోళ్లకు) రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల గోళ్లు వాటి సహజమైన గులాబీ రంగును కోల్పోయి, తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపిస్తాయి.

Advertisement

2. పెళుసైన గోళ్లు:

గోళ్లకు తగినంత ఆక్సిజన్ , పోషకాలు అందనప్పుడు అవి బలహీన పడతాయి. చిన్న పాటి ఒత్తిడికే గోళ్లు విరిగిపోవడం లేదా పొరలు పొరలుగా ఊడిపోవడం వంటివి జరిగితే, అది రక్త ప్రసరణ లోపానికి సంకేతం కావచ్చు.

3. గోళ్లపై నిలువు గీతలు:

వయస్సు రీత్యా గోళ్లపై గీతలు రావడం సహజం. కానీ అకస్మాత్తుగా గోళ్లపై లోతైన నిలువు గీతలు ఏర్పడితే.. అది రక్త ప్రసరణలో అవరోధాలను సూచిస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గోళ్ల కణజాలం దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుతుంది.

4. గోళ్ల పెరుగుదల మందగించడం:

మీరు గమనించినట్లయితే.. కొందరికి గోళ్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పోషకాలు అందక గోళ్ల పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిపోతుంది.

5. పసుపు రంగులోకి మారడం:

గోళ్లు పసుపు రంగులోకి మారడం అనేది కేవలం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు కాలేయ సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా జరగవచ్చు. రక్తంలో లిపిడ్ స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు గోళ్ల రంగులో మార్పులు రావచ్చు.

6. స్ప్లింటర్ హెమరేజెస్ :

గోళ్ల కింద సన్నని ఎర్రటి లేదా ముదురు గోధుమ రంగు గీతలు కనిపిస్తే వాటిని ‘స్ప్లింటర్ హెమరేజెస్’ అంటారు. ఇవి చిన్న రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఏర్పడతాయి. గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఇవి కనిపించే అవకాశం ఉంది.

7. గోళ్లు వంకరగా మారడం:

రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల గోళ్లు కింది వైపుకు వంకరగా లేదా ఉబ్బినట్లు మారతాయి. దీనిని ‘క్లబ్బింగ్’ అంటారు. ఇది తీవ్ర మైన గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలతో పాటు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సూచిస్తుంది.

Also Read: చికెన్ ప్రియులా లేదా మటన్ ప్రేమికులా? ఈ పోషక విలువల గురించి మీకు తెలుసా ?

జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలు:

పైన పేర్కొన్న సంకేతాలు కనిపించినంత మాత్రాన మీకు కచ్చితంగా కొలెస్ట్రాల్ ఉందని చెప్పలేము.. కానీ ఇవి శరీరంలోని అంతర్గత సమస్యలకు హెచ్చరికలు.

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్: వెంటనే డాక్టరును సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం: నూనె పదార్థాలు తగ్గించి, ఓట్స్, పండ్లు, కూరగాయలు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×