E-Paper
Advertisement

Home Remedies For Joint Pain: పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా.. మోకాళ్ల నొప్పి తగ్గించే సింపుల్ ట్రిక్స్

Home Remedies For Joint Pain: పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా.. మోకాళ్ల నొప్పి తగ్గించే సింపుల్ ట్రిక్స్

Home Remedies: మారుతున్న లైఫ్ స్టైల్ , ఆహారపు అలవాట్లు అంతే కాకుండా శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామందిలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణం అయిపోయాయి. మెట్లు ఎక్కాలన్నా.. కింద కూర్చోవాలన్నా నరకం కనిపిస్తుంది. అయితే.. ప్రతిసారీ పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. మన వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన వస్తువులతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు డాక్టరును సంప్రదించడం ఎంత ముఖ్యమో.. హోం రెమెడీస్‌‌తో ఉపశమనం పొందడం కూడా అంతే ముఖ్యం.

మోకాళ్ల నొప్పులు: కారణాలు , నివారణలు:
సాధారణంగా వయసు పెరగడం వల్ల కీళ్ల మధ్య ఉండే గుజ్జు తగ్గడం వల్ల నొప్పులు వస్తాయి. కానీ ప్రస్తుతం యువతలో కూడా క్యాల్షియం లోపం, అధిక బరువు వల్ల ఈ సమస్య కనిపిస్తోంది. నొప్పిని తగ్గించి, కీళ్లను బలోపేతం చేసే కొన్ని ఇంటి చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

1. పసుపు, పాలు :
పసుపులో ‘కర్కుమిన్’ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉంటుంది. ఇది కీళ్ల వాపును, నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

2. అల్లం టీ లేదా అల్లం రసం:
అల్లంలో నొప్పిని తగ్గించే సహజ గుణాలు ఉన్నాయి. ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుంది. అంతేకాకుండా.. అల్లం నూనెతో మోకాళ్లపై మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. ఆముదం లేదా నువ్వుల నూనె మసాజ్:
ఆముదం లేదా నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి మోకాళ్లపై మృదువుగా మసాజ్ చేయాలి. దీని వల్ల కీళ్ల మధ్య దృఢత్వం పెరిగి, కదలికలు సులభం అవుతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే.. ముందు మసాజ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

4. వేడి,చల్లని కంప్రెస్ :
నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఆ ప్రాంతం మొద్దుబారి నొప్పి తగ్గుతుంది. వాపు లేనప్పుడు వేడి నీటి కాపడం పెట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ రెండింటిని మార్చి మార్చి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5.మెంతి గింజల వాడకం:
మెంతుల్లో కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఒక టీస్పూన్ మెంతి గింజలను నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగి, గింజలను నమిలి తినడం వల్ల కీళ్ల సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల శరీరంలోని విష తుల్యాలు బయటకు పోతాయి. ఇది కీళ్లలోని లూబ్రికేషన్ పెంచడానికి సహాయ పడుతుంది.

Also Read: హాట్ కాఫీ వర్సెస్ కోల్డ్ కాఫీ.. పోషకాలు దేనిలో ఎక్కువ?

7. సరైన ఆహారం, బరువు :
శరీర బరువు పెరిగితే ఆ భారం మొత్తం మోకాళ్లపై పడుతుంది. అందుకే.. బరువు తగ్గడం చాలా ముఖ్యం. ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (చేపలు, వాల్‌నట్స్), క్యాల్షియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.

ఈ చిట్కాలు ప్రాథమిక స్థాయిలో నొప్పులకు , ఉపశమనానికి బాగా పని చేస్తాయి. అయితే.. నొప్పి చాలా తీవ్రంగా ఉన్నా లేదా వాపు తగ్గకపోయినా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం అవసరం. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామాలు, యోగా చేయడం వల్ల మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×