E-Paper
Advertisement

ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత

ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత
Advertisement

AP Inter Results-2026: ఎట్టకేలకు ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయిర్ పరీక్షా ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్థులు ఏమాత్రం నిరాశ చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు.

ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026.. బాలికలదే పైచేయి

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ-ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక పాస్ పర్సంటేజీ సాధించిన టాప్-5 జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. తొలుత సెకండియర్ ఫలితాల విషయానికి వద్దాం టాప్-5లో ఐదు జిల్లాలు నిలిచాయి. ఆయా జిల్లాలు 80 శాతం పైగానే ఉత్తీర్ణత సాధించాయి.

ఇంటర్ ఫస్టియర్ 3,61, 526 మంది విద్యార్థులు పాసయ్యారు. అందులో బాలురు ఉత్తీర్ణత 72 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 81 శాతంగా ఉంది. సెకండియర్‌లో 3,59,816 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురులు ఉత్తీర్ణత 76 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 85 శాతం ఉంది. ఒక ఒకేషనల్ కోర్సులో ఫస్టియల్ ఫలితాల్లో 61 శాతం మంది పాసయ్యారు. సెకండియర్‌లో 74 శాతం మంది పాసయ్యారు.

Advertisement

ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత

కృష్ణా జిల్లా 92 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. తర్వాత గుంటూరు జిల్లా 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతంలో మూడో స్థానంలో నిలిచింది. నాలుగు స్థానంలో పార్వతీపురం మన్యం-87 శాతం కాగా, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా 86 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంలో నిలిచింది.

ఇక ఫస్టియర్ ఫలితాల విషయానికి వద్దాం. అందులోనూ కృష్ణా జిల్లా 90 శాతంతో అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా 88 శాతం, విశాఖపట్నం జిల్లా 85 శాతం, ఎన్టీఆర్ జిల్లా 84 శాతం, పార్వతీపురం మన్యం జిల్లా 83 శాతంతో నిలిచాయి. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు అధైర్యపడొద్దన్నారు మంత్రి లోకేష్.

ALSO READ: వైసీపీ నేతలకు కష్టాలు.. జగన్ మాజీ సీపీఆర్వో, ఆ పార్టీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి అరెస్ట్

ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు అధైర్యపడొద్దన్నారు మంత్రి లోకేష్. ఈ వైఫల్యాన్ని ఒక మెట్టుగా భావించాలన్నారు. మరింత కష్టపడి చదవాలని సూచించారు. భవిష్యత్తులో తిరిగి గొప్ప విజయం సాధించాలన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత సున్నితమైన విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఫలితాల కోసం విద్యార్థులు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చన్నవారు. వీటికితోడు manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సైట్ రద్దీ వల్ల స్లో అయితే ఆల్టర్నేట్ సైట్లు ఉపయోగించాలని అధికారులు విద్యార్థులను కోరారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×