E-Paper
Advertisement

Dates with Empty Stomach: ఖాళీ పొట్టతో ఖర్జూరాలు తింటే ఎంత మంచిదో?

Dates with Empty Stomach: ఖాళీ పొట్టతో ఖర్జూరాలు తింటే ఎంత మంచిదో?
Advertisement

చలికాలం వచ్చినా, వేసవి వచ్చినా కొన్ని ఆహారాలు అన్ని కాలాల్లోనూ శరీరానికి శక్తినిస్తాయి. అలాంటి వాటిలో ఖర్జూరాలు ప్రధానమైనవి. చిన్నగా కనిపించే ఈ పండు పోషకాలతో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఖాళీ పొట్టతో ఖర్జూరాలు తింటే శరీరానికి మరింత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే మన శరీరం పోషకాలను త్వరగా గ్రహించే స్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో ఖర్జూరాలు తింటే వాటిలోని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి చేరుతాయి.

సహజ శక్తిని అందిస్తుంది
ఖర్జూరాలు సహజ శక్తి ఆహారంగా పేరుపొందాయి. వీటిలో ఉండే సహజ చక్కెరలు గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో రెండు మూడు ఖర్జూరాలు తింటే శరీరం వెంటనే శక్తివంతంగా మారుతుంది. అలసట, బలహీనత తగ్గుతాయి. మనకు ఉదయం చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. పిల్లలైనా, పెద్దలనైనా ఉదయం ఖర్జూరాలు తీసుకుంటే రోజంతా ఫ్రెష్‌గా ఉండడంలో సహాయపడుతుంది. ఇది కాఫీ లేదా టీలా కాకుండా సహజ శక్తినిచ్చే ఆహారం కావడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అందుకే ఉదయం ఖాళీ పొట్టతో ఖర్జూరాలు తినడం శరీరానికి చాలా మంచిదని అంటారు.

Advertisement

త్వరగా అరిగిపోతాయి
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఖర్జూరాల పాత్ర పెద్దది. ఖర్జూరాలలో ఉండే ఫైబర్ కడుపులో ఉన్న అడ్డుకట్టలు తగ్గిస్తుంది. చలికాలంలో సాధారణంగా జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమయంలో మలబద్ధకం ఎక్కువగా వస్తుంది. ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఇవి సహజంగా జీర్ణవ్యవస్థను పని చేయించేలా సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే పీచు ఆంత్రములను శుభ్రం చేస్తుంది. ఉదయం ఖర్జూరాలు తింటే రోజంతా కడుపు తేలికగా ఉంటుంది. పైగా ఖర్జూరాలు కడుపులో ఆమ్లతను తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి. గ్యాస్, అజీర్ణం, ఇసిమిటీస్ సమస్య ఉన్నవారికి ఇవి సహజమైన ఉపశమనం ఇస్తాయి.

రక్తహీనత తగ్గుతుంది
ఖర్చూరాల్లో ఇనుము మంచి పరిమాణంలో ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటే శరీరం ఇనుమును తొందరగా గ్రహిస్తుంది. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ఇది చాలా ప్రయోజనం చేస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి పెరగడంలో ఖర్జూరాలు సహాయపడతాయి. అలాగే వీటిలో పొటాషియం, మ్యాగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. గుండెకు కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండడంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఖాళీ పొట్టతో తిన్నప్పుడు ఈ పోషకాలు శరీరం త్వరగా తీసుకుంటుంది. ఆ కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

Advertisement

మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరాలు చాలా ముఖ్యమైనవి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తాయి. చలికాలంలో సీజనల్ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం ఖర్జూరాలు తింటే శరీరం ఈ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా ఎదుట పోరాడే శక్తిని పొందుతుంది. పైగా ఖర్జూరాలు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. మెదడు చురుకుగా ఉండేందుకు అవి సహజ ఆహారంగా పనిచేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి, మనసు ప్రశాంతంగా ఉండే స్థితి మెరుగుపడుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×