E-Paper
Advertisement

Tamil nadu Bus Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 11 మంది మృతి

Tamil nadu Bus Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 11 మంది మృతి
Advertisement

Tamil nadu Bus Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివగంగై సమీపంలోని సమత్తోపురంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు బస్సుల డ్రైవర్ల పరిస్థితి గురించి కూడా ఆందోళన నెలకొంది. ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Advertisement

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు అధికారికంగా ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×