E-Paper
Advertisement

Alcohol: డ్రింక్ చేశారా? మీ బాడీ నుంచి పూర్తిగా ఆల్కహాల్ బయటకు వెళ్లడానికి పట్టే సమయం ఇదే!

Alcohol: డ్రింక్ చేశారా? మీ బాడీ నుంచి పూర్తిగా ఆల్కహాల్ బయటకు వెళ్లడానికి పట్టే సమయం ఇదే!

Alcohol:చాలామంది ఆల్కహాల్ తీసుకున్న కొద్ది గంటలకే దాని ప్రభావం తగ్గిపోయిందని, తాము సాధారణ స్థితికి వచ్చేశామని భావిస్తారు. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంటుంది. హ్యాంగోవర్ తగ్గినప్పటికీ, శరీరంలోని రక్తం, యూరిన్, చివరకు జుట్టులో కూడా ఆల్కహాల్ ఆనవాళ్లు చాలా కాలం పాటు ఉంటాయి. ఇది కేవలం మీరు తాగిన పరిమాణంపైనే కాకుండా.. మీ వయస్సు, బరువు , కాలేయ పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. మద్యం మన శరీరంలో ఎంతకాలం నిలిచి ఉంటుందో తెలిపే శాస్త్రీయ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

శరీరంలో మద్యం నిలిచి ఉండే కాలం:

మద్యం సేవించినప్పుడు అది జీర్ణవ్యవస్థ ద్వారా నేరుగా రక్తంలోకి చేరుతుంది. అక్కడి నుంచి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అయితే.. శరీరం దీనిని ఒక విష పదార్థంగా భావించి, సాధ్యమైనంత త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది.

1. రక్తంలో మద్యం :

రక్తంలో మద్యం సుమారు 6 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలో కాలేయం ఒక గంటకు సుమారు 0.015 BACచొప్పున మద్యాన్ని తగ్గిస్తుంది. అంటే మీరు ఒక పెగ్ తాగితే.. అది రక్తం నుంచి పూర్తిగా తొలగిపోవడానికి కనీసం ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది.

2. ఊపిరి :
పోలీసులు చేసే డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో వాడే బ్రెత్ అనలైజర్ ద్వారా 24 గంటల వరకు మద్యం ఆనవాళ్లను గుర్తించవచ్చు. మనం గాలి పీల్చి వదిలినప్పుడు ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలిలో ఆల్కహాల్ అణువులు ఉంటాయి. వీటిని ఈ యంత్రాలు సులభంగా గుర్తిస్తాయి.

3. యూరిన్ :
ఆల్కహాల్ తీసుకకున్న తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తే 12 నుంచి 48 గంటల వరకు పాజిటివ్ అని వచ్చే అవకాశం ఉంది. అధునాతన పరీక్షల ద్వారా అయితే తాగిన 80 గంటల తర్వాత కూడా యూరిన్ లో ఆల్కహాల్ ఉనికిని కనిపెట్టవచ్చు.

4. లాలాజలం :
లాలాజల పరీక్షల ద్వారా 12 నుంచి 24 గంటల వరకు ఆల్కహాల్ గుర్తించే వీలుంది.

5. జుట్టు :
ఇది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. మీరు ఆల్కహాల్ తీసుకున్న 90 రోజుల తర్వాత కూడా జుట్టు కుదుళ్ల ద్వారా దాని ఆనవాళ్లను పసిగట్టవచ్చు. మన జుట్టు పెరిగే కొద్దీ ఆల్కహాల్ మెటబోలైట్స్ అందులో నిక్షిప్తమై ఉంటాయి.

ప్రభావితం చేసే అంశాలు:
కాలేయం: శరీరంలోని 90% మద్యాన్ని కాలేయం మాత్రమే శుద్ధి చేస్తుంది. కాలేయం బలహీనంగా ఉంటే.. మద్యం ఎక్కువ కాలం శరీరంలో ఉంటుంది.

బరువు, కొవ్వు: శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే ఆల్కహాల్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ఆహారం: ఖాళీ కడుపుతో తాగితే మద్యం రక్తంలోకి వేగంగా చేరుతుంది. అదే ఆహారం తీసుకున్న తర్వాత తాగితే శోషణ నెమ్మదిగా జరుగుతుంది.

వయస్సు: వయస్సు పెరిగే కొద్దీ మెటబాలిజం తగ్గిపోతుంది. దీని వల్ల మద్యం శుద్ధి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మద్యం ప్రభావం మెదడుపై కొన్ని గంటలే ఉన్నప్పటికీ..అవయవాల నుంచి అది పూర్తిగా తొలగిపోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మద్యం తాగిన తర్వాత కనీసం 24 గంటల వరకు వాహనాలు నడపడం లేదా ఏకాగ్రత అవసరమైన పనులు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం, మద్యాన్ని ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది.

Related News

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

Big Stories

×