E-Paper
Advertisement

షాపింగ్ మాల్‌లో మీకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? ఇదంతా మాల్ యజమాన్యం చేసే మైండ్ గేమ్

షాపింగ్ మాల్‌లో మీకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? ఇదంతా మాల్ యజమాన్యం చేసే మైండ్ గేమ్
Advertisement

మీరు ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లేటప్పుడు అవసరమైన కొన్ని వస్తువులు మాత్రమే కొనాలని అనుకుంటాం. కానీ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి చేతుల్లో పట్టుకోలేనన్ని బ్యాగులు, జేబులో ఖాళీ పర్స్ కనిపిస్తుంది. ఇది కేవలం మీ అలవాటు వల్ల మాత్రమే కాదు దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేసేలా మాల్స్ కొన్ని ప్రత్యేకమైన మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగిస్తాయి. ఈ ట్రిక్స్ గురించి ముందే తెలుసుకుంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఐదు ముఖ్యమైన మాల్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.

1. దారి తప్పించేలా మాల్ నిర్మాణం

చాలా షాపింగ్ మాల్స్‌లో బయటకు వెళ్లే మార్గం సులభంగా కనిపించదు. మాల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా కొంచెం క్లిష్టంగా రూపొందిస్తారు. పై అంతస్తుకు వెళ్లే ఎస్కలేటర్ సులభంగా కనిపిస్తుంది. కానీ కిందకు రావాలంటే ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. ఈ విధంగా కస్టమర్లు అనేక ఐటెమ్స్ చూస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. దాంతో కొత్త ఉత్పత్తులు కనిపించి కొనాలనే ఆసక్తి పెరుగుతుంది.

2. పెద్ద షాపింగ్ ట్రాలీ ఇవ్వడం

Advertisement

మాల్‌లోకి వెళ్లగానే పెద్ద షాపింగ్ ట్రాలీ లేదా బాస్కెట్ ఇస్తారు. ఖాళీగా ఉన్న పెద్ద ట్రాలీని చూసి చాలా మంది అందులో మరికొన్ని వస్తువులు వేయాలనుకుంటారు. అవసరం లేకపోయినా చిన్నచిన్న వస్తువులను కొనేస్తారు. చిన్న బాస్కెట్ తీసుకుంటే అది త్వరగా నిండిపోతుంది. దీంతో అనవసర కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

3. అవసరమైన వస్తువులను చివరలో ఉంచడం

పాలు, బ్రెడ్, పిండి, నిత్యావసర వస్తువులను మాల్ ముందు భాగంలో ఉంచరు. వాటిని ఎక్కువగా చివరి వరుసల్లో లేదా వెనుక భాగంలో ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్లేలోపు దుస్తులు, బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపిస్తాయి. చాలామంది వాటిలో కొన్ని ట్రాలీలో వేసుకుంటారు. చివరకు అవసరం లేని వస్తువులకూ డబ్బు ఖర్చు చేస్తారు.

4. గడియారాలు, కిటికీలు లేకుండా ఉండటం

Advertisement

పెద్ద షాపింగ్ మాల్స్‌లో గోడ గడియారాలు కనిపించవు. బయట వెలుతురు కనిపించే పెద్ద కిటికీలు కూడా ఉండవు. అందువల్ల సమయం ఎంత అయిందో కస్టమర్లకు తెలియదు. సమయం గుర్తు లేకపోతే ఎక్కువసేపు మాల్‌లో తిరుగుతారు. ఎక్కువ సమయం గడిపితే కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. ప్రశాంతమైన సంగీతం, చల్లటి వాతావరణం కూడా ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి.

5. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చివరి ట్రిక్

బిల్లింగ్ కౌంటర్ వద్ద కూడా మరో తెలివైన మార్కెటింగ్ పద్ధతి ఉంటుంది. అక్కడ చాక్లెట్లు, చూయింగ్ గమ్, బ్యాటరీలు, కీచైన్లు వంటి తక్కువ ధర వస్తువులు ఉంచుతారు. బిల్లు కోసం వేచి ఉండే సమయంలో చాలా మంది వాటిని గమనిస్తారు. ధర తక్కువే కదా అని వెంటనే తీసుకుంటారు. ఒక్కో వస్తువు చిన్నదే అయినా మొత్తం బిల్లుపై ప్రభావం చూపుతుంది.

Also Read: చాణక్య నీతి.. ఈ 5 రకాల మనుషులకు ఎప్పుడూ సహాయం చేయకూడదు.. చాలా ప్రమాదకరం

తెలివిగా షాపింగ్ చేయండి

షాపింగ్‌కు వెళ్లే ముందు అవసరమైన వస్తువుల జాబితా సిద్ధం చేసుకోవాలి. ఆ జాబితాలో ఉన్నవే కొనడానికి ప్రయత్నించాలి. కొద్దిపాటి వస్తువులు మాత్రమే కొనాలనుకుంటే పెద్ద ట్రాలీకి బదులుగా చిన్న బాస్కెట్ ఉపయోగించడం మంచిది. ముందుగానే ఖర్చు పరిమితిని నిర్ణయించుకుంటే అనవసర కొనుగోళ్లు తగ్గుతాయి. ఈ చిన్న అలవాట్లు మీ డబ్బును ఆదా చేయడంతో పాటు తెలివిగా షాపింగ్ చేయడంలో సహాయపడతాయి.

Related News

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

Big Stories

Advertisement
×