Reduce Cholesterol 7 Days: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే.. దీనిని తగ్గించుకోవడానికి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. సరైన ఆహార నియమాలు, సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే.. కేవలం 7 రోజుల్లోనే కొలెస్ట్రాల్ స్థాయిలలో సానుకూల మార్పులను చూడవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే మీ శరీరాన్ని డిటాక్స్ చేసి, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తెచ్చే ఆ సింపుల్, ఎఫెక్టివ్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఎందుకు పెరుగుతుంది?
మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే.. కానీ అది మంచి కొలెస్ట్రాల్ అయి ఉండాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. 7 రోజుల్లో దీనిని తగ్గించుకోవడానికి ఒక పక్కా ప్లాన్ అవసరం.
7 రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే పవర్‌ఫుల్ చిట్కాలు:
వారం రోజుల్లోనే రిజల్ట్ కనిపించాలంటే మీ ఆహారంలో.. లైఫ్ స్టైల్ లో ఈ కింది మార్పులు తప్పనిసరిగా చేయాలి.
1. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా తీసుకోండి:
కరిగే పీచు పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను స్పాంజ్ లాగా పీల్చేసి బయటకు పంపేస్తుంది.
ఓట్స్, బార్లీ: మీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ చేర్చుకోండి. ఇవి కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తాయి.
చిక్కుళ్ళు, బీన్స్: వీటిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
2. యాంటీఆక్సిడెంట్స్ ఉండే పండ్లు, కూరగాయలు:
ఈ 7 రోజులు మీ ప్లేట్‌లో సగం భాగం పండ్లు, ఆకుకూరలతో నింపేయండి.
ఆపిల్స్, బేరి పండ్లు, సిట్రస్ ఫుడ్స్ (నిమ్మ, నారింజ): వీటిలో ఉండే ‘పెక్టిన్’ అనే పదార్థం కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
వెల్లుల్లి: రోజూ ఉదయాన్నే ఒకట్రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే.. కొలెస్ట్రాల్ వేగంగా అదుపులోకి వస్తుంది.
3. హెల్తీ ఫ్యాట్స్ మాత్రమే (మంచి కొవ్వులు):
శరీరానికి కొవ్వులు పూర్తిగా బంద్ చేయకూడదు. కానీ చెడు కొవ్వుల స్థానంలో మంచి కొవ్వులు తీసుకోవాలి.
నట్స్: రోజూ గుప్పెడు బాదం లేదా వాల్‌నట్స్ తినండి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
ఆలివ్ ఆయిల్: వంటల్లో సాధారణ నూనెలకు బదులు ఎక్స్‌ట్రా ఆలివ్ ఆయిల్ వాడటం అలవాటు చేసుకోండి.
4. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్‌కు గుడ్ బై చెప్పండి:
ఈ 7 రోజులు సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, బేకరీ ఐటమ్స్, ప్యాక్ చేసిన చిప్స్ వంటి ‘ట్రాన్స్ ఫ్యాట్స్’ ఉన్న పదార్థాలను ముట్టుకోవద్దు. అలాగే డీప్ ఫ్రై చేసిన వంటకాలకు పూర్తిగా దూరంగా ఉండండి.
5. రోజూ గ్రీన్ టీ తాగండి:
సాధారణ పాలు.. చక్కెర టీలకు బదులుగా రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రం చేసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
Also Read: ఫ్రిజ్ లేదా? నో ప్రాబ్లం! ఈ సింపుల్ ట్రిక్స్‌తో కూరగాయలు వారమైనా ఫ్రెష్
7 రోజుల ఫిట్‌నెస్ మంత్రం:
డైత్‌తో పాటు శారీరక శ్రమ ఉంటేనే కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది.
కార్డియో వ్యాయామాలు: రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ చేయండి.
యాక్టివ్‌గా ఉండండి: ఆఫీస్‌లో లేదా ఇంట్లో గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా.. ప్రతి గంటకు ఒకసారి లేచి కాసేపు నడవండి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయ పడుతుంది.
7 రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. పైన పేర్కొన్న డైట్, లైఫ్‌స్టైల్ మార్పులను తూచా తప్పకుండా పాటిస్తే.. వారం రోజుల్లో మీ లిపిడ్ ప్రొఫైల్ రీడింగ్స్‌లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అయితే.. కొలెస్ట్రాల్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా.. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ ఈ చిట్కాలను పాటించడం బెస్ట్. ఆరోగ్యకరమైన గుండె కోసం నేటి నుంచే మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి.