BigTV English

Childrens : పిల్లలకు పద్ధతులు నేర్పటం ఎలా?

Childrens : పిల్లలకు పద్ధతులు నేర్పటం ఎలా?

Childrens : ఎదిగే వయసు చిన్నారులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, కుటుంబ సభ్యులను అనుకరించటం ద్వారా, స్కూలులో టీచర్లు, తోటి విద్యార్థులను చూసి ఎలా ప్రవర్తించాలనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వీటిలో ఇతరులతో మర్యాదగా వ్యవహరించటం ఎలా? అనేది ఒక ముఖ్యమైన అంశం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు దీనికి సంబంధించిన విషయాలను నేర్పించగలిగితే.. ఆ పిల్లలు సంస్కారవంతమైన పౌరులుగా మారతారు. దీనికోసం సైకాలజీ నిపుణులు ఇస్తున్న కొన్ని సలహాలు.. మీకోసం..


ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు.. మధ్యలో వెళ్లి ఆటంకపరచకుండా ఉండటం, తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటం అలవాటు చేయాలి. మధ్యలో ఆటంకపరచటం వల్ల వాళ్ల సంభాషణ ఆగిపోతుందని పెద్దలు వివరించి చెప్పటం వల్ల పిల్లలు ఇక.. ఆ పనిచేయరు.

ఎవరి నుంచి.. ఏ చిన్న సాయం పొందినా, ఆ సాయం చేసిన వారికి ‘థాంక్స్’ చెప్పటం నేర్పించాలి. ఇలా థాంక్స్ చెప్పటం వల్ల ఎదుటివారికి మనపట్ల సానుకూల భావన ఏర్పడుతుందని పిల్లలకు విడమరచి చెప్పాలి.


ఎవరి నుంచి ఏదైనా సాయం కోరేటప్పుడు.. ‘ప్లీజ్’ అనే పదాన్ని వాడాలని పిల్లలకు చెప్పాలి. దీనివల్ల పిల్లలకు వినయం అబ్బుతుంది. ‘నేను’ అనే ఇగో దరిచేరదు.

బంధువుల ఇంటికి లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పడు.. అక్కడ కనిపించిన వస్తువులను తాకటం, చేతిలోకి తీసుకోవటం, ఆటలాడటం చేయటం మర్యాద కాదని పిల్లలకు చెప్పాలి. దీనివల్ల అవతలివారు ఇబ్బందిగా ఫీలవుతారని, ఇది మన పరిధి దాటటమేనని వివరించాలి.

ఇంటికి ఎవరైనా వస్తున్నారని ముందుగా తెలిస్తే.. వారికి ఎదురెళ్లి, తలుపుతీసి, లోపలికి రమ్మని ఆహ్వానించటం, వారికి కూర్చోటానికి సీటు చూపించటం, మంచినీళ్లు ఆఫర్ చేయటం నేర్పించాలి.

షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో.. అవతలివారు గ్లాస్ డోర్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తే.. ఆగి, వాళ్లు ఇటువైపు వచ్చిన తర్వాతే.. మనం వెళ్లాలని చెప్పాలి. అదే.. సీనియర్ సిటిజన్స్ వస్తుంటే వారిని గౌరవించేలా.. వారికోసం డోర్ తీసి పట్టుకోవటం అవసరమని వివరించాలి.

పిల్లలు కొన్నిసార్లు పొరబాట్లు (తెలియక చేసేవి), మరికొన్ని సార్లు తప్పులు (తెలిసి చేసే పనులు) చేస్తుంటారు. పెద్దలు వీటిని గమనించి, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది చెప్పాలి. ఈ విషయంలో పిల్లల మీద అరవటం, వారిని కొట్టటం, విసుక్కోవటం చేయకూడదు.

ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే.. అలా చేయటం వల్ల ఎదుటివారికి కలిగే అసౌకర్యాన్ని, ఇబ్బందిని వివరించాలి. అలా చెప్పిన తర్వాత ‘మళ్లీ ఇలా చేయొద్దు’ అని చెప్పి వారిని ఓసారి హగ్ చేసుకోండి. దీనివల్ల పెద్దలమీద వారికి ప్రేమ, నమ్మకం కలిగి.. మరోమారు ఆ తప్పు చెయ్యరాదనే ఫీలింగ్ కలుగుతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పాలనుకుంటున్నారో.. దానిని ముందుగా వారు ఆచరించాలి. పిల్లలు ఉదయాన్నే లేచి చదవమని చెప్పే తల్లిదండ్రులు.. తాము కూడా అంతకు 5 నిమిషాల ముందే లేచి తమ పని చేసుకుంటే.. పిల్లలూ తమ టైంకి మీరు చెప్పింది ఫాలో అవుతారు.

పిల్లలు ఏమి చేయకూడదో చెప్పటానికి బదులు.. ఏది చేయటం మంచిదో చెప్పాలి. ‘అల్లరి చెయ్యద్దు’ అనేందుకు బదులు.. ‘బుద్ధిగా ఉండాలి’ అనటం వల్ల వారిలో సానుకూల ప్రభావం కనిపిస్తుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×