BigTV English

Pawan Kalyan : కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan : కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan : రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా నిన్న హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో రిషబ్ శెట్టి మాట్లాడిన మాటలు పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.


ఇంతకు రిషబ్ శెట్టి చేసిన తప్పేంటి అంటే, ఈ సినిమా గురించి తాను మాట్లాడుతూ మొదట తెలుగులో నమస్కారం చెప్పారు. ఆ తర్వాత తన స్పీచ్ అంతా కూడా కేవలం కనడ లోనే మాట్లాడారు. అయితే రిశబ్ శెట్టి కు తెలుగు మాట్లాడటం కూడా బాగా తెలుసు. గతంలో తన కాంతారా సినిమా సక్సెస్ అయినప్పుడు పలు ఇంటర్వ్యూస్ లో మాట్లాడారు.

మొత్తం కన్నడ

కనీసం ఇంగ్లీషులో మాట్లాడిన కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు కంప్లీట్ కన్నడలో మాట్లాడారు అంటూ చాలామంది నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అని ట్విట్టర్ యువత పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.


ఆటంకాలు పెట్టొద్దు,

ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు పెట్టొద్దు అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. “కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి… విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాము. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము.

మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు.” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

భారీ అంచనాలు 

మరోవైపు ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి అన్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో వచ్చిన కాంతారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా హోంబోలె ఫిలిమ్స్ నిర్మించింది. ఈ బ్యానర్ కి కూడా ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంది. మంచి సినిమాలను మాత్రమే నిర్మిస్తుంది అనే నమ్మకం చాలా మంది ఆడియన్స్ లో ఈ బ్యానర్ కలిగించింది.

Also Read: Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

Related News

OG Film : పవన్ ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు బెనిఫిట్స్, అసలైన రిజల్ట్ ఇప్పుడు తేలుతుంది

OG Movie: ఓజి సినిమాకు మరో షాక్… తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

Kantara Chapter1: చెన్నైలో కాంతార చాప్టర్ 1 ఈవెంట్ రద్దు… ఆ ఘటన కారణమా?

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Allu Arjun : నెక్స్ట్ లెవెల్ డాన్స్ మూవ్స్, అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Big Stories

×