OG Movie: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఓజి(OG). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రెండు రోజులు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చింది. వెంటనే తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేటు తగ్గించాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు పెంచిన టికెట్ల ధరలు అందుబాటులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. ఇలా సినిమా టికెట్ల ధరలను వెంటనే తగ్గించుకోవాలి అంటూ ప్రభుత్వం తెలియజేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కాగా 24వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారమయ్యాయి అయితే ప్రీమియర్లకు 800 రూపాయల టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వ అనుమతి తెలిపింది.
ఇక సినిమా విడుదలైన రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో సినిమా టికెట్ల ధరలో 150 రూపాయలు పెంచారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 100 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పెంచిన ధరలకు అక్టోబర్ 4వ తేదీ వరకు అనుమతించిన తెలంగాణ సర్కారు ఉన్నఫలంగా టికెట్ ధరలను తగ్గించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా పూర్తిస్థాయిలో కలెక్షన్లు పడిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లను కూడా తగ్గిస్తే పలు ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమేనని భావిస్తున్నారు.
ఓవర్సీస్ లో మంచి ఆదరణ..
ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకొని మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓజి సినిమా కలెక్షన్లపై పూర్తిస్థాయిలో దెబ్బ పడుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలై ఐదు రోజులవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 200 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 80% వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే కనుక పవన్ ముందు భారీ టార్గెట్ ఉంది. సుమారు 300 కోట్ల కలెక్షన్లు రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. మరి ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఓవర్సీస్ లో థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
Also Read: Kantara Chapter1: చెన్నైలో కాంతార చాప్టర్ 1 ఈవెంట్ రద్దు… ఆ ఘటన కారణమా?