Belly Fat: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అనేక మంది పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది జిమ్‌లకు వెళ్లి పెరిగిన బరువు తగ్గించుకోవాలనుకుంటే ఇంకొంత మంది వాకింగ్ , డైట్ ఫాలో అవుతుంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించాలి. వీటి ద్వారా ఈజీగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా తగ్గించుకోవడానికి చిట్కాలు:
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి వాకింగ్ ఒక అద్భుతమైన, సులభమైన వ్యాయామం. కేవలం నడవడం కాకుండా.. మీ లైఫ్ స్టైల్‌లో చిన్న పాటి మార్పులు చేసుకోవడం ద్వారా మీరు కొవ్వును త్వరగా కరిగించుకోవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును వేగంగా తగ్గించుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు ప్రభావ వంతంగా పనిచేస్తాయి.
నడకలో వేగం పెంచండి:
సాధారణంగా నెమ్మదిగా నడవడం కంటే.. వేగంగా నడవడం ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. గుండె వేగంగా కొట్టుకునేలా.. శ్వాస కొద్దిగా పెరిగేలా నడవండి. ముఖ్యంగా.. ‘వయసరల్ ఫ్యాట్’ (అవయవాల చుట్టూ ఉండే ప్రమాదకరమైన కొవ్వు)ను తగ్గించడానికి వేగవంతమైన నడక చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
ఇంటర్వెల్ వాకింగ్‌ను అనుసరించండి:
వాకింగ్ తీవ్రతను పెంచడం:
5 నిమిషాలు సాధారణ వేగంతో నడవండి. తర్వాత 1 నిమిషం పాటు మీ సామర్థ్యం మేరకు వేగంగా పరుగెత్తండి లేదా నడవండి. మళ్లీ సాధారణ వేగానికి మారండి. ఈ సైకిల్‌ను మీ మొత్తం నడక సమయంలో కనీసం 4-5 సార్లు పునరావృతం చేయండి. ఈ ‘ఇంటర్వెల్ ట్రైనింగ్’ వల్ల మెటబాలిజం (జీవక్రియ) పెరుగుతుంది.
కొండ ప్రాంతాల్లో నడవండి:
సాధారణ నేలపై నడవడం కంటే కొండ ప్రాంతాల్లో లేదా మెట్లు ఎక్కడం వల్ల కండరాలు మరింత ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. ట్రెడ్‌మిల్‌పై నడిచేటప్పుడు కూడా ఇన్‌క్లైన్ (వాలు) సెట్టింగ్‌ను పెంచి నడవండి.
పొట్ట కండరాలను బిగించండి:
నడిచేటప్పుడు కేవలం కాళ్లను మాత్రమే కాకుండా.. మీ పొట్ట కండరాలను లోపలికి లాగి బిగించి ఉంచండి. ఈ విధంగా చేయడం వల్ల మీ కోర్ కండరాలు చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా భంగిమ మెరుగు పడటంతో పాటు ఉదర కండరాలపై ఒత్తిడి పెరిగి కొవ్వు కరుగుతుంది.
Also Read: మీరు చేసే.. ఈ పొరపాట్లే బరువు పెరగడానికి కారణమట !
నడక సమయాన్ని పెంచండి:
రోజుకు కనీసం 45 నుంచి 60 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం నడవడం వల్ల కార్బోహైడ్రేట్‌ల నిల్వలు అయిపోయి, శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను వినియోగించడం ప్రారంభిస్తుంది. ఇది కొవ్వును తగ్గించడంలో కీలకం.
ఈ చిన్నపాటి మార్పులను వాకింగ్ లో భాగం చేసుకుంటే.. బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా, ఆరోగ్యంగా తగ్గించుకోవడంలో మీరు మంచి ఫలితాన్ని చూడవచ్చు. నడకతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి.