Kantara Chapter1: కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కాంతారా చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాషలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక నేడు చిత్ర బృందం ముంబైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే రేపు(మంగళవారం) చెన్నైలో కూడా ఈ సినిమా వేడుకను నిర్వహించడం కోసం నిర్మాణ సంస్థ హోం భళే ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఈ సినిమా వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే ఇటీవల హీరో విజయ్ కరూర్ సభలో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాంతార చాప్టర్ 1 సినిమా వేడుకను రద్దు చేస్తున్నట్లు హోంభలే అధికారకంగా వెల్లడించారు.
ఈ ఘటనలో భాగంగా మరణించిన వారికోసం కుటుంబం కోసం సంతాపాన్ని తెలియజేస్తూ సరైన సమయంలోనే తమిళనాడు ప్రేక్షకులను కలుస్తామని సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఇటీవల పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కాంతార సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంతార సినిమా భూత కోల నృత్య నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాగా ఫ్రీక్వెల్ సినిమా మాత్రం రాజులు యుద్ధాల నేపథ్యంలో రాబోతోందని తెలుస్తుంది.
అంచనాలు పెంచిన ట్రైలర్…
ఇక ఈ సినిమాకు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈయనకు జోడిగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటించారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 విడుదల కానుండగా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రసారం కానున్నాయి. ఇక ఈ సినిమాపై రిషబ్ శెట్టి ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు మొదటిసారి తన సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆదరణ వస్తుందోననే కంగారు తనలో ఎక్కువగా ఉంది అంటూ ప్రమోషన్లలో తెలియజేశారు. మరి కాంతారా తరహాలోనే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంటుందా? లేదా అనేది తెలియాల్సింది.
Also Read: Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!