E-Paper
Advertisement

Viral News: హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట… హోటల్ గదిలో భార్యకు ఊహించని షాక్ ఇచ్చిన భర్త

Viral News: హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట… హోటల్ గదిలో భార్యకు ఊహించని షాక్ ఇచ్చిన భర్త

పెళ్లయ్యాక కొత్త జంట ఎంతో ఆనందంగా హనీమూన్ కు వెళతారు. అలాగే ఒక జంట వెళ్లింది కానీ… హోటల్ గదిలో భార్యకు పెద్ద షాక్ ఇచ్చాడు వరుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో జరిగింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న యువకుడు, తన భార్యతో కలిసి హనీమూన్ కోసం బయటకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. మొదట అంతా సరిగానే ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ అర్థరాత్రి నవ వధువు లేచే సరికి వరుడు ఇప్పుడే వస్తా అంటూ వెళ్లి మరి రాలేదు. దీంతో హోటల్ గదిలో భార్య సింగిల్ గా మిగిలిపోయింది.

అంతా అయ్యాక వెళ్లిపోయాడు
ఆమె పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం వరుడు రాత్రి అయ్యాక తన భార్యతో కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి హోటల్ గది నుంచి బయటకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరికీ ఫస్ట్ నైట్ పూర్తయింది. భార్య మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ గంటలు గడిచినా అతడు తిరిగి రాలేదు. అతని ఫోన్ చేస్తే అది కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో ఆమెకు భయం మొదలైంది. కొత్తగా పెళ్లైన మహిళ కావడంతో ఏమి చేయాలో అర్థం కాక గదిలోనే ఎదురుచూసింది. రాత్రి మొత్తం గడిచిపోయినా వరుడు తిరిగి రాకపోవడంతో ఆమె చాలా భయపడిపోయింది. ఉదయం అయ్యాక చాలా సేపు వెయిట్ చేసింది. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో హోటల్ సిబ్బందిని అడిగింది. కానీ వారికి కూడా అతని ఆచూకీ తెలియలేదు. చివరికి ధైర్యం చేసి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ప్రవర్తనలో తేడా
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తన బాధను వివరించింది. పెళ్లికి ముందు నుంచే తన భర్త ప్రవర్తన కొంత అనుమానంగా ఉండేదని, అయినా పెళ్లి తర్వాత అన్నీ సరిదిద్దుకుంటాయని అనుకున్నానని చెప్పింది. కానీ హనీమూన్‌కు వచ్చిన వెంటనే ఇలా వదిలేసి పారిపోవడం తనను చాలా బాధపెట్టిందని చెప్పింది. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుడు ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు ఇలా చేశాడు? అతడు ముందే పెళ్లి చేయడానికి ఇష్టపడలేదా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గురించి తెలిసిన బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లి అయ్యి కొన్ని రోజులే కావడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని వారు కన్నీటితో చెప్పారు. తమ కూతురికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. “హనీమూన్ అంటే ఆనందం, కొత్త జీవితం మొదలు పెట్టే సమయం. కానీ ఇలాంటి ఘటనలు వివాహ బంధంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి” అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొందరు యువకుల నిర్లక్ష్య నిర్ణయాల వల్ల మహిళలు మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

పోలీసులు త్వరలోనే వరుడిని పట్టుకుంటామని తెలిపారు. అతడు దొరికిన తర్వాత నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. హనీమూన్‌కు వెళ్లి భార్యను ఒంటరిగా వదిలేసి పారిపోయిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×