E-Paper
Advertisement

Road Accident: కూకట్‌పల్లిలో విషాదం.. ప్రాణం తీసిన వేగం.. ముక్కలు ముక్కలైన బైక్

Road Accident: కూకట్‌పల్లిలో విషాదం.. ప్రాణం తీసిన వేగం.. ముక్కలు ముక్కలైన బైక్
Advertisement

హైదరాబాద్  కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ లూలూ మాల్ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సుల్తాన్ పాషా, షేక్ ఉమర్ అనే ఇద్దరు యువకులు రాత్రి సమయంలో R15 బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తున్నారు. లూలూ మాల్ ఫ్లైఓవర్‌పై బైక్ అదుపు తప్పడంతో వారు వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న యువకులు ఎగిరిపడ్డారు.

Advertisement

ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బైక్ నియంత్రణ కోల్పోయి వెనుక నుంచి వస్తున్న కారును ఢీకొట్టిన దృశ్యాలు మొత్తం ఫ్లైఓవర్‌పై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరును ఈ దృశ్యాలు కళ్ళకు కట్టాయి.

Advertisement

కేపీహెచ్‌బీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి క్షతగాత్రుడి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను కూడా విచారిస్తున్నారు. అతివేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో ఈ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది.

ALSO READ: Hyderabad: తొడల మధ్య రుద్దుకుంటూ.. కూరగాయల అమ్మకం, వ్యాపారి అరెస్ట్

Related News

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×