BigTV English

Monsoon Season: వర్షాకాలంలో బెల్లం, మిరియాలతో ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..

Monsoon Season: వర్షాకాలంలో బెల్లం, మిరియాలతో ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..

Monsoon Season: వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు తరముతుంటాయి. ఇన్ఫెక్షన్లు, అంటు వ్యాధులు వంటివి వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి ఉంటాయి. ఈ తరుణంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే జ్వరం, దగ్గు, జలుబు వంటి అంటు వ్యాధులు సోకుతుంటాయి. ఈ తరుణంలో బెల్లం, మిరియాలు వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందువల్ల వీటిని తీసుకుంటే ఏ వ్యాధులు నయం అవుతాయో తెలుసుకుందాం.


బెల్లం, మిరియాలు ఉపయోగాలు..

జలుబు, దగ్గు :


వర్షాకాలంలో జలుబు, దగ్గు రావడం సహజం, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మిరియాలు, బెల్లం తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఈ తరుణంలో గ్లాసులో వేడి నీళ్లు తీసుకుని బెల్లం ముక్క, చిటికెడు మిరియాల పొడి కలుపుకుని తాగితే వెంటనే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

గొంతు నొప్పి :

గొంతు నొప్పితో బాధపడేవారు బెల్లం, మిరియాలు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని కోసం మిరియాల పొడి 20 గ్రాములు, బెల్లం 50 గ్రాములు తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కీళ్ల నొప్పులు :

బెల్లంలో శరీరానికి అందాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బెల్లంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు మిరియాలలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పైపెరిన్ కీళ్ల నొప్పులు తగ్గేలా చేస్తుంది.

జీర్ణక్రియ :

కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు బెల్లం, మిరియాలు సహాయపడతాయి. జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

పీరియడ్స్ నొప్పి :

పీరియడ్స్ సమయంలో బెల్లం, మిరియాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అందువల్ల టీలో బెల్లం, మిరియాలు కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×