BigTV English

Yash Toxic Movie: రాఖీ భాయ్ యష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పూజా కార్యక్రమంతో ‘టాక్సిక్’ షురూ..!

Yash Toxic Movie: రాఖీ భాయ్ యష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పూజా కార్యక్రమంతో ‘టాక్సిక్’ షురూ..!

Yash Toxic Movie pooja ceremony(Cinema news in telugu): కన్నడ స్టార్ హీరో యష్ అంటే తెలియని వారుండరు. ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యావత్ ప్రపంచ సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించాడు. యష్‌గా కంటే రాఖీ భాయ్‌గానే అందరి మెదల్లో గుర్తుండిపోయాడు. అతడు హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 1, 2’ సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. అప్పటి వరకు యష్ ఎవరో తెలియని వారికి కూడా కేజీఎఫ్ సినిమాలు అతడి పేరును మారుమోగించాయి. దీంతో యష్‌కి ఊహించని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. అయితే ఈ హీరో ‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత మరే మూవీని చేయలేదు.


దీంతో ఈ సారి యష్ ఇంకెలాంటి ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు తన కెరీర్‌లో 19వ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది.

Also Read: రాఖీభాయ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ హీరోయిన్..?


పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైందంటూ హీరో యష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా పంచుకున్నాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా నేమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. కాగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా అఫీషియల్‌గా మేకర్స్ స్టార్ట్ చేశారు. మొదటిగా బెంగళూరు, ఆ తర్వాత ముంబైలలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ లండన్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో యష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్. అలాగే సీనియర్ హీరోయిన్ నయనతార ఇందులో యష్‌కి అక్కగా నటిస్తున్నట్లు సమాచారం. మరో హీరోయిన్ తారా సుతారియా కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి ఇందులో నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందనే చెప్పాలి. కాగా ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×