E-Paper
Advertisement

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !
Advertisement

Health Tips: ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఉదయం పూట టిఫిన్ వంటివి ఏవైనా పదార్థాలు తీసుకోకపోయినా కూడా సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు తరచూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తే మరికొన్ని పదార్థాలు అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్ల రసాలు :

Advertisement

ఉదయం పూట ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఇందులో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచేలా చేస్తుంది. మరోవైపు ఇందులో ఉండే ఫైబర్ కంటెవంట్ ఆకలిని కూడా తగ్గిస్తుంది.

అరటి పండు :

Advertisement

అరటి పండును కూడా ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే గుండె సంబంధింత సమస్యలు ఎదురవుతాయి. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని ఉదయం పూట తీసుకోవడం వల్ల గుండె స్పందన రేటులో మార్పులు ఎదురవుతాయి.

ఆయిల్ ఫుడ్ :

ఉదయం పూట ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు, గుండెలో మంట, అల్సర్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

పుల్లని ఆహారాలు :

పుల్లని ఆహారం ఉదయం పూట తీసుకుంటే కడుపులో జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. చెడు బ్యాక్టీరియా కూడా పెరిగి వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల పుల్లని ఆహారం, పుల్లని పండ్లను అస్సలు ఉదయం పూట తీసుకోకూడదు.

స్వీట్స్ :

పరగడుపున స్వీట్లు తీసుకోవడం వల్ల చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వీట్లు తినడానికి రుచిగా ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంటుంది.

మాంసాహారం :

ఉదయం పూట మాంసాహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బేరి పండ్లు :

పండ్లు ఉదయం పూట తీసుకోవడం మంచిదే అయినా అందులో కొన్ని రకాల పండ్లు అనారోగ్యానికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా బేరి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×