E-Paper
Advertisement

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..
Advertisement

Mirnalini Ravi: కోలీవుడ్  హాట్ బ్యూటీ మిర్నాలిని రవి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లకు ఆమె తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది కలనే కదా. ఇప్పుడు ఆ కలను ఆమె నెరవేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. తాము కొత్తగా కొన్న ఇంటిలోకి తల్లిదండ్రులతో పాటు అడుగుపెట్టింది. గృహ ప్రవేశంకు సంబంధించిన ఫోటోలను మిర్నాలిని రవి షేర్ చేస్తూ   తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

నా చిన్నతనంలో నాన్న తన అమ్మ పేరు పెట్టి ఇంటిని నిర్మించాడు.   అప్పటి నుండి నేను కూడా ఒక ఇల్లు నిర్మించి, దానికి మా అమ్మ (మోజి) పేరు పెట్టాలనేది నా కల. ఆ కలలు నిజమవుతాయని నాకు అప్పుడు తెలియదు. కానీ, ఇప్పుడు మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో నా కల నిజమైంది. దీన్ని సాధించడానికి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ కృతజ్ఞతలు చేస్తున్నాను.ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు   నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇక మిర్నాలిని రవి గురించి చెప్పాలంటే.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. తెలుగులో వరుణ్ తేజ్- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మిర్నాలిని రవి కి వరుస అవకాశాలు  తలుపుతట్టాయి. 

ముఖ్యంగా ఎనీమీ సినిమాలోని తుమ్ తుమ్ సాంగ్ తో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో  వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.  మరి ముందు ముందు ఈ చిన్నది తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఇల్లు కట్టడం అయ్యింది.. మరి పెళ్లి  ఎప్పుడు  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ చిన్నది కూడా ఆ పెళ్లి వార్త చెప్తుందేమో చూడాలి. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×