BigTV English
Advertisement

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Drinking alcohol before sleep | మద్యం సేవించే అలవాటు ఉన్న చాలామంది.. ప్రతి రోజూ లేదా తరుచూ రాత్రి పూట నిద్రపోయే ముందు మద్యం తాగుతారు. అయితే ఆ సమయంలో తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఆరోగ్యకరమైన నిద్ర కోల్పోవడంతో పాటు మెదడుపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.


రాత్రిపూట మద్యం సేవిస్తే మంచి నిద్ర పడుతుందని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అలా జరగదు. ఆ నిద్ర ఆరోగ్యకరమైంది కాదు. సాధారణంగా నిద్రపోయిన తరువాత కనురెప్పలు మూసుకుపోయినా.. మన కళ్లు వేగంగా కదులుతుంటాయి. ఇలా జరగడంతో భావోద్వేగాలు నియంత్రణ, మెదడుకు జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. కానీ మద్యం తాగి నిద్రపోతే మత్తు వల్ల కనురెప్పలు మూసుకుపోయిన తరువాత కళ్లలో కదలికలు ఉండవు.. లేదా కదలికలు చాలా నిదానంగా జరుగుతాయి. ఫలితంగా మెదడు భావోద్వేగ నియంత్రణ కోల్పోతుంది.

ఫార్టిస్ హాస్పిటల్ లో పనిచేసే ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ బంగా ఈ అంశంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మద్యం తాగిన తరువాత మనిషికి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రపోతుండగా తరుచూ లేచి బాత్ రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. ఈ కారణంగా నిద్రాభంగం జరిగి శరీరానికి సరైన విశ్రాంతి లభించదు. పైగా రాత్రి వేళల్లో మద్యపానం చేస్తే.. నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ఒకవేళ నిద్రపోయినా శ్వాస సంబంధిత సమస్యలు ప్రారంభమై రక్తపోటు (హై బీపి), గుండె సంబంధిత రోగాల వచ్చే ప్రమాదముంది.


Also Read: కిచెన్ లో బల్లి రాకుండా ఈ టిప్స్ పాటించండి..

పైగా నిత్యం రాత్రి వేళ నిద్రపోయే ముందు మద్యం సేవిస్తే.. మెదుడులోని కీలక భాగాలు సరిగా పనిచేయకపోవడంతో త్వరగా జ్ఞాపక శక్తి, విచక్షణ శక్తి కోల్పోయే ప్రమాదముంది. ఏదైనా పని చేసే సమయంలో సరైన ధ్యానం కేంద్రీకరించకపోవడం (ఫోకస్ చేయలేకపోవడం) జరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే స్థోమత మెదుడు కోల్పోతుంది. పైగా రాత్రి మద్యం సేవించి పడుకుంటే మరుసటి రోజంతా శరీరంలో ఎక్కువ అలసటగా ఉంటుంది.

అందుకే మెదుడు ఆరోగ్యం కోసం, మంచి నిద్ర కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవడం, రాత్రివేళ నిద్రపోయేముందు మద్యపానం చేయకుండా ఉండడం చేయాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటే మీరు నిత్యం హుషారుగా ఉంటారు.

Related News

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేదంటే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Banana Hair Mask: అరటి పండుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే సిల్కీ హెయిర్

Gold Cleaning Tips: బంగారు ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా ఇంట్లోనే సింపుల్‌గా తళతళలాడించేయండి

Pomegranates: వీళ్లు.. దానిమ్మ అస్సలు తినకూడదు తెలుసా ?

Rava Pulihora: ఒక్కసారి రవ్వ పులిహోర ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Big Stories

×