E-Paper
Advertisement

Penukonda Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు

Penukonda Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు
Advertisement

Penukonda Accident: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియా పరిశ్రమ సమీపంలో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం  తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడినవారు శ్రీ సత్యసాయి జిల్లా నార్నేవారిపల్లికి చెందిన కుటుంబ సభ్యులు. వీరు ఓ శుభకార్యం ముగించుకొని పెన్నహోబిలం నుంచి బెంగళూరు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డులోని డివైడర్ వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో.. కారు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పెనుగొండ పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

Also Read: చెట్టును ఢీకొన్న కారు.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Advertisement

ప్రమాద స్థలంలో కొంతసేపు వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×