E-Paper
Advertisement

ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్.. చుక్క నూనె లేదు సరే, ఆరోగ్యం సంగతేంటీ?

ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్.. చుక్క నూనె లేదు సరే, ఆరోగ్యం సంగతేంటీ?
Advertisement

Air Fryer: ఈ రోజుల్లో కిచెన్ గ్యాడ్జెట్స్‌లో ‘ఎయిర్ ఫ్రైయర్’తప్పని సరిగా మారింది. నూనె లేకుండా సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వేపుళ్లు చేసుకోవచ్చని అందరూ దీనికి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి, జిమ్‌కు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే.. కేవలం నూనె వాడకపోతేనే అది ఆరోగ్యకరమైన ఆహారం అయిపోతుందా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? విపరీతమైన వేడి గాలితో ఆహారాన్ని వండేటప్పుడు అందులో వచ్చే మార్పులేంటి? ఎయిర్ ఫ్రైయర్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని షాకింగ్ నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్- చుక్క నూనె లేదు సరే.. ఆరోగ్యం ఉందా?

Advertisement

నూనె వాడకాన్ని తగ్గించడం ద్వారా క్యాలరీలను కంట్రోల్ చేయొచ్చనే మాట వాస్తవమే. కానీ.. ఎయిర్ ఫ్రైయర్ పని చేసే తీరును గమనిస్తే కొన్ని సందేహాలు వస్తాయి. ఇందులో అతి తక్కువ సమయంలో విపరీతమైన వేడి వల్ల ఆహారం ఉడుకుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని పరిణామాలు జరుగుతాయి.

1. అక్రిలమైడ్ ముప్పు:
స్టార్చ్ (పిండి పదార్థం) ఎక్కువగా ఉండే ఆలుగడ్డల వంటి పదార్థాలను ఎయిర్ ఫ్రైయర్‌లో అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో వండినప్పుడు ‘అక్రిలమైడ్’ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. నూనెలో వేయించిన వాటితో పోలిస్తే.. ఇందులో తక్కువగా ఉన్నప్పటికీ, అసలు ముప్పు లేదని మాత్రం చెప్పలేం.

Advertisement

2. పోషకాలు మాయం:
విపరీతమైన వేడి గాలి ఆహారంపై నేరుగా పడటం వల్ల అందులోని సున్నితమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ దెబ్బతింటాయి. డీప్ ఫ్రైతో పోలిస్తే.. ఇది బెటర్ కావొచ్చు కానీ.. ఆవిరి మీద ఉడికించిన ఆహారంతో పోలిస్తే.. దీని పోషక విలువలు తక్కువే.

3. ‘ఆరోగ్యకరం’ అనే భ్రమ:
ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అని చాలా మంది చిప్స్, ప్యాక్ చేసిన ఫ్రోజెన్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. గుర్తుంచుకోండి, ఆ ఆహార పదార్థాల్లో అప్పటికే ప్రిజర్వేటివ్స్, ఎంపీజీ ఉంటాయి. మీరు నూనె లేకుండా వండినంత మాత్రాన ఆ జంక్ ఫుడ్ హెల్తీ ఫుడ్‌గా మారిపోదు.

4. గుండె ఆరోగ్యం,కొలెస్ట్రాల్:
కేవలం నూనె వేయకపోవడం వల్లే గుండెకు మంచిది అనుకోవడం పొరపాటు. నాన్ వెజ్.. ఎయిర్ ఫ్రై చేసేటప్పుడు అందులోని కొవ్వు పదార్థాలు ఆక్సీకరణం చెంది ‘కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ఉత్పత్తులు’ ఏర్పడతాయి. ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయి.

Also Read: చికెన్ ముక్క కనిపిస్తే చాలు లాగించేస్తున్నారా? ఈ పార్టులు తింటే.. హాస్పిటల్ పాలు కావాల్సిందే!

ఎయిర్ ఫ్రైయర్‌ను ఎలా వాడితే సేఫ్?
ఉష్ణోగ్రత తగ్గించండి: అతి తక్కువ సమయంలో వండాలని.. టెంపరేచర్ పెంచేయకండి. తక్కువ వేడి మీద ఎక్కువ సేపు వండటం మేలు.

కూరగాయలకు ప్రాధాన్యత: కేవలం చికెన్, ఫ్రైస్ కాకుండా కూరగాయలను రోస్ట్ చేయడానికి దీన్ని వాడండి.

అతిగా వద్దు: వారానికి ఒకటో రెండో సార్లు వాడటం పర్వాలేదు కానీ.. ప్రతి రోజూ ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×