E-Paper
Advertisement

Chicken-Diabetics: డయాబెటిస్‌ బాధితులు చికెన్ తినొచ్చా? ఎంత మోతాదు మంచిది ?

Chicken-Diabetics: డయాబెటిస్‌ బాధితులు చికెన్ తినొచ్చా? ఎంత మోతాదు మంచిది ?
Advertisement

Chicken – Diabetics: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడే ఆహార పదార్థాలలో చికెన్ ఒకటి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా.. వివిధ రకాలుగా వండుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ క్రమంలో చికెన్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. దీనికి గల కారణాలు, చికెన్‌లోని పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ప్రధానంగా లీన్ ప్రోటీన్‌కు మూలం. అంటే ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కానీ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

కండరాల ఆరోగ్యం: చికెన్‌లో ఉండే అధిక ప్రోటీన్ కండరాల పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది.

ఎముకల బలం: ప్రోటీన్‌తో పాటు ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తాయి.

Advertisement

రోగనిరోధక శక్తి: జలుబు లేదా ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ సూప్ తాగమని తరచుగా డాక్టర్లు చెబుతుంటారు. ఇది శరీరంలోని రోగనిరోధక కణాలకు శక్తినివ్వడమే కాకుండా.. శ్వాసనాళాలను క్లియర్ చేస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులకు చికెన్ ఎలా ఉపయోగపడుతుంది ?

షుగర్ ఉన్నవారికి ఆహార నియమాలు చాలా కీలకం. చికెన్ తీసుకోవడం వల్ల ఈ కింది లాభాలు ఉన్నాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI): చికెన్ సహజంగానే తక్కువ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.

బరువు నియంత్రణ: టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి బరువు తగ్గడం చాలా అవసరం. చికెన్ తక్కువ కొవ్వు కలిగి ఉండటం వల్ల.. కడుపు నిండిన భావనను ఇది కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది.

గుండె , కిడ్నీల ఆరోగ్యం: రెడ్ మీట్‌తో పోలిస్తే చికెన్‌లో సంతృప్త కొవ్వులు తక్కువ. అందుకే ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది.

గాయాలు త్వరగా మానడం: చికెన్ లివర్‌లో ఉండే విటమిన్-కె రక్తం గడ్డకట్టే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులలో గాయాలు కూడా త్వరగా నయమవుతాయి.

Also Read: చలికాలంలోనూ శరీరం వేడిగా ఉండాలా ? అయితే ఇవి తినండి

ఆరోగ్యకరమైన పద్ధతులు:

చికెన్ ఆరోగ్యకరమే అయినప్పటికీ.. దానిని వండే విధానంపైనే దాని గుణాలు ఆధారపడి ఉంటాయి.డయాబెటిస్ ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించాలి.

Also Read: చలికాలంలోనూ శరీరం వేడిగా ఉండాలా ? అయితే ఇవి తినండి

స్కిన్ లెస్ చికెన్: చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చర్మం తీసేసిన చికెన్‌ను ఎంచుకోవాలి.

నూనె వాడకం తగ్గించాలి: డీప్ ఫ్రై చేసిన చికెన్ కంటే గ్రిల్డ్, బాయిల్డ్ లేదా బేక్ చేసిన చికెన్ చాలా ఉత్తమం.

ఆర్గానిక్ చికెన్: సాధ్యమైనంత వరకు హార్మోన్ ఇంజెక్షన్లు లేని.. సహజంగా పెరిగిన చికెన్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మొత్తానికి.. డయాబెటిస్ ఉన్నవారికి చికెన్ ఒక వరమని చెప్పవచ్చు. అయితే.. తీసుకునే చికెన్ పరిమాణం, వంటలో ఉపయోగించే ఉప్పు, నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన పద్ధతిలో వండుకుని తింటే.. ఇది డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో మేలు చేస్తుంది.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×