E-Paper
Advertisement

రెడీ మేడ్ దోశల పిండి.. తింటే మరణమే, కారణాలు ఇవే !

రెడీ మేడ్ దోశల పిండి.. తింటే మరణమే, కారణాలు ఇవే !
Advertisement

Ready made Dosa Batter: అహ్మదాబాద్‌లో జరిగిన విషాదం విన్నారా? బయట షాపుల్లో కొన్న రెడీమేడ్ పిండితో వేసిన దోశలు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా.. మనం రోజూ చేసే పొరపాట్లకు ఒక వార్నింగ్ బెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బిజీ లైఫ్ వల్ల టైమ్ సేవ్ అవుతుందని ఎక్కువగా ఇన్‌స్టెంట్ పిండి వాడుతున్నాం. కానీ కిరాణా షాపులు, డైరీల్లో సరిగ్గా నిల్వ చేయకపోవడం లేదా పిండి బాగా పులిసిపోయినా అది ప్రమాదకరమైన ‘ఫుడ్ పాయిజన్’గా మారుతుంది.

రెడీమేడ్ దోశ పిండి: ఆరోగ్యామా? అనారోగ్యమా?

Advertisement

అహ్మదాబాద్‌కు చెందిన విమల్ ప్రజాపతి కుటుంబం స్థానిక డైరీలో కొన్న ఇడ్లీ పిండితో దోశలు వేసుకుని తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. కేవలం మూడు నెలల పసిపాపతో పాటు, నాలుగేళ్ల చిన్నారి కూడా మరణించడం అత్యంత బాధాకరం. ఈ ఘటనతో రెడీమేడ్ పిండి వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రమాదానికి కారణాలు ఏంటి?
సాధారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు పెరిగినప్పుడు పిండి త్వరగా పులిసిపోతుంది. సరైన నిల్వ పద్ధతులు పాటించకపోతే అందులో ఈ-కోలి (E.coli), సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు చేరతాయి. చిన్న చిన్న దుకాణాల్లో తయారుచేసే పిండిలో శుభ్రత లోపించడం, తయారీకి కలుషితమైన నీటిని వాడటం వల్ల కూడా అది పాయిజన్‌గా మారుతుంది.

Advertisement

ప్యాక్డ్ ఇన్‌స్టంట్ మిక్స్ సురక్షితమేనా?
అహ్మదాబాద్ ఘటనలో వాడింది తడి పిండి. దీనికి భిన్నంగా పేరున్న బ్రాండ్ల ఇన్‌స్టంట్ డ్రై పౌడర్లు కొంత వరకు సురక్షితం. ఎందుకంటే.. అవి డీహైడ్రేటెడ్ రూపంలో ఉంటాయి. మనం నీళ్లు కలిపే వరకు అందులో పులియబెట్టే ప్రక్రియ మొదలవ్వదు. అయితే.. వీటిని కొనేటప్పుడు కూడా FSSAI లోగో, తయారీ తేదీని తప్పక చెక్ చేయండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

స్వయంగా తయారుచేసుకోవడం: సాధ్యమైనంత వరకు బియ్యం, మినపప్పు నానబెట్టి ఇంట్లోనే పిండి రుబ్బుకోవడం బెస్ట్.

స్టోరేజ్: ఒకవేళ బయట పిండి కొన్నా, అది ఫ్రిజ్‌లో ఉందో లేదో చూడండి. తెచ్చిన వెంటనే వాడుకోవాలి లేదా వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి.

వాసన/రంగు: పిండి విపరీతమైన పుల్లటి వాసన వస్తున్నా, పైన నీరు నల్లగా మారినా అది పాడైపోయిందని అర్థం. అలాంటి పిండిని వాడకండి.

బ్రాండెడ్ వస్తువులే మేలు: లూజ్ పిండి కంటే, సరైన ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలు ఉన్న బ్రాండెడ్ పిండిని తీసుకోవడం బెస్ట్.

Also Read: చికెన్ ముక్క కనిపిస్తే చాలు లాగించేస్తున్నారా? ఈ పార్టులు తింటే.. హాస్పిటల్ పాలు కావాల్సిందే!

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఆహార పదార్థాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

గమనిక:
ప్యాకెట్ పిండి కొనేటప్పుడు తయారీ తేదీ, నిల్వ పద్ధతిని తప్పక చెక్ చేయండి. అతిగా పులిసినా లేదా వాసన వచ్చినా వాడకండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తాజా పిండిని తయారు చేసుకోవడం మీ కుటుంబ ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×