BigTV English

Kid Playing with Snake: ఏమి ధైర్యంరా బుడ్డోడా.. 7 అడుగుల పాముతో ఆటలా..?

Kid Playing with Snake: ఏమి ధైర్యంరా బుడ్డోడా.. 7 అడుగుల పాముతో ఆటలా..?
Advertisement

2 Years Old Kid Playing with Snake: రెండేళ్ల పిల్లాడంటే ఏం చేయగలడు చెప్పండి కామన్‌గా. వచ్చీరాని నడకతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. ఈ ప్రపంచాన్ని మరచిపోయి ఆడుకుంటారు. కానీ ఇక్కడ కనిపించే ఈ బుడ్డోడు మాత్రం.. నా రూటే సపరేటు అంటున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడో తెలుసా..? రెండేళ్ల వయసులో రెండు మీటర్ల పాముతో ఆటాడుకుంటున్నాడు. ఏంటి సుత్తికొడుతున్నాడు అని అనుకుంటున్నారా..? లేదు గురూ నిజమే. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ బుడ్డోడి ఖలేజా ఏంటో మీకే తెసుస్తుంది.


ఏంటి షాక్ అయ్యారా వీడియో చూసి. అట్లుంటది మరి మా బుడ్డోడి లెక్క..! అయితే మీరు ఈ వీడియో చూశాక మీకు వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవడు? ఆ పాముతో ఆటలేంటి? అది అసలు నిజమైన పామేనా అనే సందేహాలు వచ్చి ఉంటాయే..? అదే పాయింట్‌కి వచ్చేశాం.


ఈ బుడ్డోడిది ఆస్ట్రేలియా. పేరు బంజో. తండ్రి పేరు మ్యాట్ రైట్. ఈయన జాబ్ మొసళ్లు, పాములు పట్టడం. గత 20 ఏళ్లుగా అతడు ఇదే పనిలో ఉన్నాడు. అతడికి పాములు, మొసళ్లను పట్టడం వెన్నతో బెట్టిన విద్య. వారి బతుకుదెురువు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. అందుకే ఆ పనిని తన కొడుకు బంజోకు నేర్పిస్తున్నాడు.

ఇందులో భాగంగానే రోజు ఓ రెండు మీటర్ల పొడవైన పామును పట్టుకుని రావడం. దాన్ని తన ఇంటి పెరట్లో వదిలి పెట్టడం చేస్తాడు. ఆ తర్వాత కొడుకు బంజోకు పాము తోకను పట్టుకునే టాస్క్ ఇస్తాడు. బంజో కూడా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ పామును పట్టుకొని ఆడుతున్న వీడియో మనం చూశాం. ప్రస్తుతానికి ఈ వీడియో ఎక్స్‌లో తెగ వైరల్ అవుతోంది.

Related News

Annapurne Sadhapurne: ఘనంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్.. అతిథులు వీరే

Ghee: రోజూ నెయ్యి తినడం వల్ల ఇన్ని లాభాలా ? తెలిస్తే అస్సలు వదలరు !

Chicken soup: మసాజ్ లేని మ్యాజిక్.. ఈ సూప్ తాగితే ఫ్లూ, గొంతు నొప్పి నిమిషాల్లో పరార్

Night Food Habits: రాత్రి పూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?

Diwali: శతాబ్దాల నాటి శాపం.. ఆ గ్రామంలో దీపావళి వెలుగులుండవు

Acidity: దీపావళి తర్వాత అసిడిటీతో.. ఇబ్బంది పడుతున్నారా ?

Diabetes Diet: మధుమేహం నియంత్రణకు పంచ సూత్రాలు.. పర్ఫెక్ట్ డైట్ పూర్తి వివరాలు

Health Tips: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు.. టపాసులకు దూరంగా ఉండాలి ! లేకపోతే ?

Big Stories

×