Delhi News: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. ప్రస్తుతం అక్కడ కాలుష్యం రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత సూచీ-347 పాయింట్లకు చేరింది. ప్రస్తుతం వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత ఉంది. చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణులు చెబుతున్నమాట.
ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
కాలుష్యం పెరగడంతో రకరకాల సమస్యలు రావచ్చని, మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గతేడాది దీపావళి మరుసటి రోజు 296గా నమోదు అయ్యింది. ఈ ఏడాదితో పోల్చితే వాయు కాలుష్యం మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో ఏక్యూఐ-345గా నమోదు అయినట్టు అధికారులు చెప్పారు.
అంటే ఆ లెక్కన గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో ఉంది. రాత్రి బాణాసంచాతో రాత్రికి రాత్రి గాలి నాణ్యత మరింత క్షీణించిందని రిపోర్టు చెబుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల మంగళవారం ఉదయం దేశ రాజధానిని దట్టమైన వాయుకాలుష్యం కమ్మేసింది. మాన్సింగ్ రోడ్, కర్తవ్య మార్గంతో సహా ప్రధాన ప్రాంతాలు కనిపించలేదు. ఎత్తైన ప్రముఖ ప్రదేశాలు కనిపించలేదు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వాయుకాలుష్యం నివేదిక ఇలా ఉంది.
హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం
చాందిని చౌక్-326, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం-318, రోహిణి ప్రాంతం-372, ఓఖ్లా ఫేజ్-2.. 353 వంటి కీలక ప్రదేశాలలో ఈ విధంగా ఉన్నాయి. ఇండియా గేట్ ప్రాంతం-342 నమోదైంది. వజీర్‌పూర్, ద్వారక, అశోక్ విహార్, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో 400 పాయింట్లు పైచిలుకు AQI స్థాయిలను నమోదు అవుతున్నాయి.
వాయు కాలుష్యం పెరగడంపై స్థానికులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. కాలుష్యం కేవలం ఈరోజు మాత్రం పెరగలేదని అంటున్నారు. ఏళ్ల తరబడి అది తీవ్రమవు తోందన్నారు. ప్రజలు ఈ సమస్యకు కారణమవుతున్నారని అంటున్నారు. పటాసులు పేల్చాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని, అయినప్పటికీ ప్రభుత్వం చర్య తీసుకోవడంలేదని ఫిర్యాదు చేస్తున్నారని చెబుతున్నారు.
ALSO READ: ఆ పని చేస్తే మీ కూతురు కాళ్లు విరగొట్టండి
ఇప్పుడే ఇలా ఉంటే.. వాయు కాలుష్యానికి తోడు పొగమంచు తోడైతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. 0 మరియు 50 మధ్య AQI మంచిదని పొల్యూషన్ బోర్డు చెబుతున్నమాట. 51 నుండి 100 వరకు సంతృప్తికరంగా ఉంటుంది. అదే 101 నుండి 200 వరకు మధ్యస్థంగా ఉంటుంది. 201 నుండి 300 వరకు పేలవంగా ఉంటుంది. 301 నుండి 400 వరకు చాలా పేలవంగా ఉందని AQI స్థాయి చెబుతోంది.
401 నుండి 500 వరకు తీవ్రంగా పరిగణిస్తారు. ఢిల్లీకి భిన్నంగా దేశంలోని వివిధ నగరాల వాయు కాలుష్యం ఈ విధంగా ఉంది. ముంబై-214, పాట్నా-224, జైపూర్-231, లక్నో-222 ఏక్యూఐ స్థాయి ఉంది. బెంగళూరు-94 సంతృప్తికరంగా ఉంది. హైదరాబాద్-107, చెన్నై-153 మధ్యస్థంగా శ్రేణిలో ఉన్నాయి.
VIDEO | Delhi: Thick smog blankets Shankar Road following Diwali celebrations, reducing visibility and affecting morning commuters.#WeatherUpdate
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/wL1TZbDGYn— Press Trust of India (@PTI_News) October 21, 2025