Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, విశాఖ శివారులో ఆయా ప్రాంతాలు చోటు చేసుకున్నారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ఘోర ప్రమాదం
హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వీఎస్టి చౌరస్తా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్ -బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంభం టూ వీలర్స్‌పై రాంనగర్ ప్రాంతం వైపు వెళ్తోంది. అయితే ప్రమాదవశాత్తు ఫైర్ ఇంజన్ వాహనం వెనుక టైర్ కిందపడింది యాక్టివా వాహనం.
ఘటన సమయంలో బైక్ పై ఫాతిమా, ఆమె కొడుకు ఇబ్రహీం మోహిక్ కూతురు వెళ్తున్నారు. అయితే 16 ఏళ్ల కూతురు మోహిక్ స్పాట్ లో మృతి చెందింది. తల్లి-కొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖలో ఘోర ప్రమాదం.. స్పాట్ ఇద్దరు యువకులు
మరోవైపు విశాఖపట్నం సిటీ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత గాజువాక జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న టూ వీలర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్పాట్‌లో మృతి చెందారు. మృతులు కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన అజయ్‌రాజు, మనోజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైనవారు ఇద్దరు మైనర్లు.
ALSO READ: ఉద్యోగి సూసైడ్.. చిక్కుల్లో ఓలా సీఈఓ
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కూర్మన్నపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. మరణించిన యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.వారి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.