BigTV English

Vishal: ఆ డైరెక్టర్ తో గొడవలు నిజమే.. విశాల్ అదిరిపోయే రియాక్షన్!

Vishal: ఆ డైరెక్టర్ తో గొడవలు నిజమే.. విశాల్ అదిరిపోయే రియాక్షన్!
Advertisement

Vishal: కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) ఒకవైపు కోలీవుడ్లో చిత్రాలు చేస్తూనే.. ఆ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఇప్పుడు తన కెరీర్లో కీలక మలుపు తీసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా ఇప్పుడు అవతారం ఎత్తడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


డైరెక్టర్ తో విశాల్ కి గొడవ..

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ రవిఅరసు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం ‘మకుటం’ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు దీపావళి సందర్భంగా విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా హీరో – డైరెక్టర్ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేశారు విశాల్..

దర్శకుడిగా అవతారమెత్తిన విశాల్..

ఈ మేరకు దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టిన ఆయన అందులో..” అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. అలాగే ఇదే సమయంలో నేను మకుటం సెకండ్ లుక్ ను మీతో పంచుకుంటున్నాను. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకుడిగా కూడా నేనే అరంగేట్రం చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. దర్శకుడిగా మారుతానని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితులు నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ముఖ్యంగా నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నిర్మాతల శ్రమ, ప్రేక్షకుల నమ్మకం కాపాడడం నా బాధ్యత. కాబట్టి మకుటం సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించేలా.. నిర్మాతల శ్రమకు రక్షణగా నిలవడానికి నేను దర్శకత్వం చేపట్టాను” అంటూ తెలిపారు.


ALSO READ:Samantha: మళ్లీ అడ్డంగా దొరికిన సమంత.. పండుగ పూట కూడా వదలరా?

డైరెక్టర్ తో గొడవలు నిజమే..

అంతేకాదు విశాల్ తన పోస్టులో కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడమే అనిపిస్తుంది. అందుకే అన్ని విషయాలను సరిచేసి పెద్ద చిత్రాన్ని విజయవంతం చేయడమే నా లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను. ముఖ్యంగా ఈ దీపావళి నాకు మరిన్ని కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇకపై దీనిని రహస్యంగా ఉంచాల్సిన పనిలేదు. నా కొత్త ప్రారంభాన్ని మీతో పంచుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ మిస్కిన్ తో క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల డిటెక్టివ్ చిత్రాన్ని కూడా నేనే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మకుటంతో నా 25 ఏళ్ల డైరెక్షన్ కల నిజమవుతుంది అంటూ తెలిపారు. విశాల్ మొత్తానికైతే డైరెక్టర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే డిటెక్టివ్ చిత్రం ఆగిపోయిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మకుటం సినిమా విశేషాలు..

మకుటం సినిమా విషయానికొస్తే.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ తోనే విశాల్ పవర్ ఫుల్ అవతారంలో కనిపించారు. డైరెక్టర్గా ఉండడం అదనపు హైలెట్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా డైరెక్టర్ గా విశాల్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Related News

Tollywood Hero : నీకు కాదు.. నాకు నచ్చినట్టు సినిమా చేయు… డైరెక్టర్‌ని ఫోర్స్ చేస్తున్న హీరో ?

Rashmika: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన రష్మిక.. నరకం అనుభవించానంటూ?

Samantha: మళ్లీ అడ్డంగా దొరికిన సమంత.. పండుగ పూట కూడా వదలరా?

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Big Stories

×