BigTV English

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది ఈ హీరోకి. ‘మయసభ’ పొలిటికల్ వెబ్ సిరీస్, ‘శబ్దం’ హర్రర్ థ్రిల్లర్ లతో ఊపు మీద ఉన్నాడు. ఒక ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ గా ‘శబ్దం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆది పినిశెట్టి ఇందులో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌ గా, ఒక కాలేజ్ మిస్టరీ డెత్ లను సాల్వ్ చేయడానికి వస్తాడు. ఈ సినిమా ఊహించని ట్విస్టుయాతో ఆసక్తికరమైన కథను అందిస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? ఈ కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘శబ్దం’ (Sabdham) ఇది అరివళగన్ డైరెక్ట్ చేసిన తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఆది పినిసెట్టి, లక్ష్మి మేనన్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న తమిళ, తెలుగు వెర్షన్‌లలో థియేటర్ రిలీజ్ అయింది. IMDbలో 6.1/10 రేటింగ్ కూడా పొందింది. మార్చి 28, 2025 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

మున్నార్‌లోని ఒక మెడికల్ కాలేజీలో వరుసగా వింత మరణాలు జరుగుతాయి. మొదట ఒక స్టూడెంట్ చనిపోతుంది. ఆమె శరీరంపై విచిత్రమైన మార్కులు కనిపిస్తాయి. కాలేజీ స్టాఫ్ దీన్ని సూపర్‌ నాచురల్ డెత్ గా అనుమానిస్తారు. అందుకే వాళ్లు రూబాన్ (ఆది పినిసెట్టి) అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌ను పిలుస్తారు. రూబాన్ ఒక ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్. అతను సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి భూతాలను ట్రాక్ చేస్తాడు. ఆ కాలేజీలో అతను సుమిత్రా అనే స్టూడెంట్‌ను కలుస్తాడు. ఆమె రూబాన్‌కు ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది. వాళ్లు కలిసి ఈ మరణాల వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ కనుక్కుంటారు. ఒక వింత శబ్దం వల్ల స్టూడెంట్స్ భయపడి చనిపోతున్నరని తెలుస్తుంది. ఇంతలో మరో స్టూడెంట్ ఒక రూమ్‌లో చిక్కుకుని, ఆ సౌండ్ వల్ల చనిపోతాడు. రూబాన్ ఆ సౌండ్‌ను రికార్డ్ చేసి, దాని వెనుక ఒక స్పిరిట్ ఉందని కన్ఫర్మ్ చేస్తాడు.


Read Also : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

రూబాన్, సుమిత్రా కలేజ్ హిస్టరీని తెలుసుకోవడం మొదలెడతారు. 20 ఏళ్ల క్రితం కాలేజీలో ఒక మ్యూజిక్ టీచర్ మిస్టీరియస్‌గా చనిపోయిందని తెలుస్తుంది. ఆ టీచర్ ఒక గొప్ప మ్యూజిషియన్, కానీ కాలేజీ స్టాఫ్ ఆమెను అన్యాయంగా ఫ్రేమ్ చేసి చంపేశారు. ఇప్పుడు ఆ స్పిరిట్ కాలేజీలో సౌండ్స్ ద్వారా తిరిగి వస్తోంది. రూబాన్ స్పిరిట్‌తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను స్పెషల్ డివైసెస్ యూజ్ చేసి, స్పిరిట్ వాయిస్ రికార్డ్ చేస్తాడు. ఆ దెయ్యం కథ విని రూబాన్ షాక్ అవుతాడు. ఇంతలో మరో డెత్ జరుగుతుంది. ఇక ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. రూబాన్ ఆ దెయ్యాన్ని బంధిస్తాడా ? దానికి న్యాయం చేస్తాడా ? స్టూడెంట్ చావులు ఆగుతాయా ? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ తమిళ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

OTT Movie : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

Big Stories

×