BigTV English

Viral News: 27 ఏళ్లుగా కనిపించని కూతురు.. చివరికి దొరికింది వాళ్ల ఇంటి బెడ్ రూమ్‌లోనే, అదెలా?

Viral News: 27 ఏళ్లుగా కనిపించని కూతురు.. చివరికి దొరికింది వాళ్ల ఇంటి బెడ్ రూమ్‌లోనే, అదెలా?
Advertisement

పోలాండ్ లో ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. 15 సంవత్సరాల వయసులో అదృశ్యమైన ఓ మహిళ 27 సంవత్సరాల తర్వాత సజీవంగా గుర్తించారు పోలీసులు. 1998 నుంచి ఆమె తల్లిదండ్రులే తనను బెడ్‌ రూమ్‌ లో బంధించినట్లు పోలీసులు వెల్లడించారు.  మిరెల్లా అనే 15 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. పొరుగువారికి కూడా అదే విషయాన్ని చెప్పారు. వారు కూడా నమ్మారు. కొంతకాలం ఆమె తల్లిదండ్రులు వెతికినట్లు నటించారు. కొద్ది రోజుల తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు.


ఆ అమ్మాయిని ఎలా గుర్తించారంటే?

ఈ సంవత్సరం జూలైలో మిరెల్లా కుటుంబం ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ లో అల్లర్లు జరిగాయి. వెంటనే పోలీసులు ఈ అల్లర్లపై దృష్టిపెట్టారు. ఆ అపార్ట్ మెంట్ ను అంతా సోదాలు చేశారు. పోలీసులు మిరెల్లా ఫ్లాట్‌ లోకి ప్రవేశించారు. ఓ చీకటి గదిలో 42 ఏళ్ల మిరెల్లా కృశించి, బలహీనంగా కనిపించింది. పోలీసులు ఆమెను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మరణానికి దగ్గరలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లోనే చికిత్స పొందుతుంది. స్థానికులు వైద్యం కోసం నిధుల సేకరణను మొదలు పెట్టారు. “మిరెల్లాను కుటుంబ సభ్యులే దాదాపు మూడు దశాబ్దాలుగా ఇంట్లో బంధించారు. ఆమె కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయిందని అందరి చేత నమ్మించారు. దురదృష్టవశాత్తు, ఆమె ఇన్నేళ్లుగా దారుణమైన జీవితాన్ని గడిపింది. ఆరోగ్యంగా ఉన్న 15 ఏళ్ల అమ్మాయిని ఇంతకాలం ఇంట్లో ఎందుకు బంధించారు? అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. ఒకే గదిలో ఆమె ఇన్నేళ్లు గడపడం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అని పొరుగు వారు చెప్పారు.

మిరెల్లా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?  

మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందినా, మిరెల్లా చీకటి గదిలో మగ్గిపోయిందని స్థానికులు తెలిపారు. “తన నగరం అభివృద్ధి చెందడం ఆమె ఎప్పుడూ చూసి ఉండదు. ఆమెకు ఏ విషయం తెలియకుండా పెరిగింది. ఆమె ఎప్పుడూ వైద్యుడిని కూడా చూడలేదు. కనీసం గుర్తింపు కార్డు పొందలేదు. సాధారణ నడకకు కనీసం బాల్కనీకి కూడా వెళ్లలేదు. ఆమె ఎప్పుడూ దంతవైద్యుడి దగ్గరికి, హెయిర్ సెలూన్ కు వెళ్లలేదు. ఆమె జుట్టు, దంతాలు క్షీణించిపోయాయి. ఆమె ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తున్నాయి. ఆమె ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్‌ కు వెళ్లడం అవసరం. అందుకే ఆమె వైద్యానికి నిధులు సమీకరిస్తున్నాం” అని వివరించారు.


దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు

మిరెల్లాను మూడు దశాబ్దాలుగా ఇంట్లో బంధించిన వ్యవహారంపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. మిరెల్లా తల్లిదండ్రులు ఎలాంటి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారు? అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. అసలు ఆమెను ఎందుకు బంధించారు అనేది కూడా త్వరలో తేలనుందన్నారు.

Read Also:  మరణానికి కొన్ని సెకన్ల ముందు.. ఇలా కనిపిస్తుందట.. పరిశోధనలో అబ్బురపరిచే విషయాలు వెల్లడి!

Related News

Viral Video: ట్రైన్‌లో ఓ యువకుడి యవ్వారం.. హిజ్రాకు ఏమిచ్చాడో తెలుసా? షాకైన ప్రయాణికులు.. వీడియో వైరల్

Bougainvillea Tree: నీరు ఎక్కువయితే వాడిపోతుంది.. తక్కువయితే పూస్తుంది! ఈ చెట్టు మిస్టరీ ఏమిటి?

YouTube 1st Month income: నెట్టింట దుమ్మురేపుతున్న భవానీ రామ్, ఫస్ట్ మంత్ సంపాదన ఎంతంటే?

Karwa Chauth: కొత్త పెళ్లి కూతుళ్ల మాస్టర్ ప్లాన్, భర్తల ఇళ్లకే కన్నం వేసిన 12 మంది భార్యామణులు!

Japan Ice Cream Company: ఐస్ క్రీమ్ ధర రూ.5కు పెంచినందుకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. అబ్బా ఏం వినయం!

New Vande Bharat: రోడ్డెక్కిన వందే భారత్ రైలు.. ఏంటీ షాకయ్యారా? మీరే చూడండి

Viral video: కారు డ్రైవర్‌కు రూ.57 వేలు ఫైన్ వేసిన పోలీసులు.. మంచి పని చేశారు, ఎందుకంటే?

Big Stories

×