Annapurne Sadhapurne:దీపావళి పండుగను పురస్కరించుకొని హైదరాబాదులో “అన్నపూర్ణే సధాపూర్ణే”.. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను కూడా సీబీఎన్ ఫోరమ్(CBN Forum) ప్రారంభించింది. అసలు విషయంలోకి వెళ్తే.. సీబీఎన్ ఫోరమ్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో “అన్నపూర్ణే సధాపూర్ణే ” తో పాటూ “బ్లడ్ డొనేషన్ డ్రైవ్” ను కూడా నిజాంపేట్ లోని వెంకట సాయి ఎంక్లేవ్, వినాయక మండపంలో శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అదుసుమిల్లి శ్రీనివాసరావు , రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పాసాని, అంకమ్మ చౌదరి ముప్పా, తెలంగాణ కేటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వశిష్ట శ్రీలక్ష్మి, ఎండి గుమ్మడి కళ్యాణ్ తదితర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీబీఎన్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు జెనెక్స్ అమర్ మాట్లాడుతూ..” ప్రతి ధాన్యం ఒక రైతు కథ చెబుతుంది. అది వారి చెమట, త్యాగం, ఆశల సంకేతం. అన్నం అనేది భూదేవి ఇచ్చిన పవిత్రమైన వరం. అందుకే మేము అన్నపూర్ణే సధాపూర్ణే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. వివిధ ఈవెంట్ల నుంచి మిగిలిన ఆహారాన్ని సేకరించి.. ఆహారం అవసరమున్న వారికి అందించడమే మా లక్ష్యం” అంటూ ఆయన తెలిపారు.
అంతేకాదు కమ్యూనిటీ రక్తదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ” ఒకచోట అన్నం వృధా అవుతుంటే.. ఇంకోచోట ప్రాణాల కోసం ఒక బొట్టు రక్తానికి ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే మేము రక్తదాన డ్రైవ్ ని కూడా ప్రారంభించాము” అంటూ స్పష్టం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకొని నిస్వార్ధంగా సేవలు అందించడానికి సీబీఎన్ ఫోరమ్ ఎప్పుడు ముందుంటుంది అని కూడా తెలిపారు.
ALSO READ:Vishal: ఆ డైరెక్టర్ తో గొడవలు నిజమే.. విశాల్ అదిరిపోయే రియాక్షన్!
అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ కి ప్రసూతి నిపుణురాలు డాక్టర్ అల్లూరి విజయలక్ష్మి , సీబీఎన్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ శారద, కోశాధికారి దేవరకొండ ఆనంద్, జనరల్ సెక్రటరీ ఎడ్లపాటి రమేష్, మీడియా ప్రముఖులు టీవీ మూర్తి, సాంబశివరావు, ఏబీఎన్ వెంకట్ కృష్ణ , తెలుగు వన్ ఎండి కంఠమనేని రవిశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఘనంగా జరగగా…ఈ సంస్థ ఎప్పటికీ ఇలా సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.