దీపావళి, ఛత్ పూజా లాంటి హిందువుల పెద్ద పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు, కార్మికులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటి లాగే ఈసారి కూడా పండుగ రద్దీ నేపథ్యంలో రైలు టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఏ రైలు చూసినా, ఇప్పటికే పెద్ద సంఖ్యలో వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోని వారు తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. సీట్ల పరిమిత లభ్యత, ఊహించని డిమాండ్ కారణంగా తత్కాల్ టికెట్ ను పొందడం అంత ఈజీ కాదు.
రద్దీని తగ్గించడానికి, బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, భారత రైల్వే పలు సంస్కరణలను తీసుకొచ్చింది. అన్ని తత్కాల్ రైళ్లకు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌గ్రేడ్ చేసిన బుకింగ్ వ్యవస్థ నిజమైన ప్రయాణీకులు టికెట్లు పొందేలా చర్యలు చేపడుతోంది. ఆన్ లైన్ బుకింగ్ లను క్రమబద్ధీకరించడానికి, జూలై 1 నుంచి టికెట్ రిజర్వేషన్ల కోసం ఆధార్ ఆధారిత మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ ప్రామాణీకరించబడిన వినియోగదారులు మాత్రమే IRCTC వెబ్ సైట్, యాప్ లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమమంలో బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత తొలి 30 నిమిషాలలో బుకింగ్ ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించబడరు. అన్ని ఆన్ లైన్ తత్కాల్ బుకింగ్ లకు ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. జనరల్ రిజర్వేషన్ విండో మొదటి 15 నిమిషాలలో ఆధార్ ప్రామాణీకరణ ఉన్న వినియోగదారులు మాత్రమే రిజర్వ్ చేయబడిన జనరల్ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. టికెట్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
⦿ తత్కాల్ టికెట్ కన్ఫార్మ్ కావాలంటే విండో ఓపెన్ కావడానికి ముందుగానే IRCTC సైట్ లోకి లాగిన్ కావాలి. ముందే ప్రయాణీకుల వివరాలు, చెల్లింపు వివరాలను రెడీ చేసుకోవాలి.
⦿ ఆధార్ ఆధారిత ప్రామాణీకరణతో మాస్టర్ లిస్ట్ ను రూపొందించడానికి IRCTC వినియోగదారులను అనుమతిస్తుంది. పేరు, వయస్సు, సీటు ప్రయారిటీ, ఫుడ్ సెలెక్షన్ లాంటి వివరాలను నమోదు చేసుకోవాలి. ఇది ప్రయాణీకుల సమయాన్ని సేవ్ చేయడంతో పాటు బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
⦿ వేగవంతమైన బుకింగ్ కోసం, ప్రయాణీకులు UPI చెల్లింపులు చేయడం బెస్ట్. ఫాస్ట్ ప్రాసెసింగ్ కోసం IRCTC వాలెట్ లో కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు.
⦿ కన్ఫార్మ్ టికెట్ పొందడానికి ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు, తక్కువ డిమాండ్ ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. పండుగ సీజన్ లో డిమాండ్ కు అనుగుణంగా భారతీయ రైల్వే రద్దీగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నాయి.
⦿ ప్రయాణీకులు తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణీకుల వివరాలను త్వరగా పూరించడానికి IRCTC తత్కాల్ మ్యాజిక్ ఆటోఫిల్ ను ఉపయోగించవచ్చు. ముందుగా నింపిన సమాచారాన్ని సేవ్ చేయడం ద్వారా, వెంటనే ఫామ్ ను ఆటోమేటిక్ గా ఫిల్ చేసి, టికెట్ కన్ఫార్మ్ అయ్యేలా చేస్తుంది.
Read Also: పండుగ సీజన్ లో టికెట్ కన్ఫార్మ్ కావాలా? సింపుల్ గా ఈ స్కీమ్ ట్రై చేయండి!